కల్యాణ వైభోగమే

Mon,April 15, 2019 01:18 AM

-సాయం సమయాన ఘనంగా రామయ్య కల్యాణం
-హాజరైన సీఎంసీపీఆర్వో వనం జ్వాలా నర్సింహారావు
ముదిగొండ, ఏప్రిల్ 14 : మండల పరధిలోని ముత్తారంలో ఎంతో విషిష్ట కలిగిన స్వయంభూ శ్రీ సీతారముల వారి కల్యాణం కనుల పండువగా జరిగింది. వసంత తిరుపక్ష బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామి వారి కల్యాణ మహోత్సవం నిర్వహించారు. దేశమంతటా సీతారామ కల్యాణం పగటిపూట జరుగుతుండగా ఇక్కడ మాత్రం సాయంత్రం 6గంటల తరువాత సంధ్యా సమయాన జరగడం విశిష్టత. స్వామివారు సంధ్యా సమయాన ప్రత్యక్షమయ్యాడనే నమ్మకంతో, భద్రాచలంలో కల్యాణం జరిగిన తరువాతనే ముత్తారం రాములవారి కల్యాణం జరపాలనే ఆనవాయితీతో సాయంత్రం స్వామి వారి కల్యాణం జరుగుతోంది. మొదటి నుంచి గ్రామ ప్రజలు ఆనవాయితీగా సాయం సమయాన రాములవారి కల్యాణం జరుపుతున్నారు. ఈ కల్యాణాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తారు. వేద పండితులు బొర్రా వాసుదేవాచార్యులు, బొర్రా శ్రీనివాసార్యులు, అర్చకబృందంచే స్వామి వారి కల్యాణం సందర్భంగా ఉదయం స్నపన తిరుమంజనం, సహస్రనామార్చన, నిత్య హోమం, బలిహరణ, విషేష పూజలు చేశారు. చెక్కభజన, కోలాట బృందం, జనాల కోలాహలం మద్య ఎదురుకోలు ఉత్సవం తరువాత ఉత్సవ విగ్రహాలను కల్యాణ మండపం వద్దకు తీసుకువెల్లి తిరుకల్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎంసీపీఆర్వో వనం జ్వాలా నర్సింహారావు, వంశపారంపర్య ధర్మకర్త వనం వెంకట నాగేశ్వరరావు, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మీగడ శ్రీనివాస్ యాదవ్, గ్రామ సర్పంచ్ తాల్ల నాగయ్య, వనంవారి క్రిష్ణాపురం గ్రామస్తులు తుపాకుల రమాదేవి, మాజీ సర్పంచ్ తుపాకుల ఎలగొండ స్వామి తదితరులు పాల్గొన్నారు.

287
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles