బ్రెయిన్ స్ట్రోక్‌తో హోంగార్డ్ మృతి

Mon,April 15, 2019 01:18 AM

వైరా, నమస్తే తెలంగాణ: వైరాలోని పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డ్‌గా పనిచేస్తున్న మండలంలోని పుణ్యపురం గ్రామానికి చెందిన పిల్లుట్ల శ్రీనివాస్ (45) బ్రైన్‌స్ట్రోక్‌తో ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. వైరాలోని పోలీస్‌స్టేషన్‌లో సీఐ డ్రైవర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ కొద్దిరోజుల క్రితం బ్రైన్‌స్ట్రోక్‌కు గురయ్యాడు. దీంతో అతనిని హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీనివాస్ ఆదివారం తెల్లవారుజామున మృతిచెందాడు. పోలీస్‌శాఖలో హోంగార్డ్‌గా సమర్ధవంతంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన శ్రీనివాస్ మృతి పట్ల వైరా ఏసీపీ దాసరి ప్రసన్నకుమార్, వైరా సీఐ రమాకాంత్ తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్‌లాల్ ఆదివారం మండలంలోని పుణ్యపురం గ్రామం లో శ్రీనివాస్ భౌతికకాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన వెంట టీఆర్‌ఎస్ నాయకులు మచ్చా వెంకటేశ్వరరావు, కట్టా కృష్ణార్జున్‌రావు, వనమా విశ్వేశ్వరరావు, సర్పంచ్ గద్దె మల్లికార్జున్‌రావు తదితరులు ఉన్నారు.

267
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles