పరిషత్ ఎన్నికలకు కసరత్తు షురూ..

Sun,April 14, 2019 01:52 AM

- ఈనెల 15,16,17 తేదీల్లో ఎన్నికల సిబ్బందికి శిక్షణ
- ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీ, జడ్పీ చైర్మన్ల రిజర్వేషన్లు పూర్తి
- ఖమ్మం-289, భద్రాద్రి కొత్తగూడెం-220 ఎంపీటీసీలు
- ఖమ్మం-20 ఎంపీపీలు, జడ్పీటీసీలు
- భద్రాద్రి కొత్తగూడెం-21 ఎంపీపీలు, జడ్పీటీసీలు
- ఖమ్మం జిల్లాలో 1612 పోలింగ్ కేంద్రాలు
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1204 పోలింగ్ కేంద్రాలు

మామిళ్లగూడెం : జిల్లా, మండల ప్రజాపరిషత్‌ల ఎన్నికలకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో జిల్లా, మండల ప్రజా పరిషత్‌ల ఎన్నికల నిర్వహణ ప్రక్రియపై ఉమ్మడి జిల్లా పరిషత్ అధికారులు చేపడుతున్నారు. రెండు జిల్లాలకు విడివిడిగా ఎన్నికలు జరుగుతున్నప్పటికీ నూతన జిల్లాల ఏర్పాటు గెజిట్ ఆమోదముద్ర కేంద్రం వేయకపోవడంతో ఎన్నికల కసరత్తును పాత జిల్లా పరిషత్‌లో నుంచే కొనసాగిస్తున్నారు. ఇటీవల ఎన్నికల నిర్వహణకు వీలుగా ఉండేందుకు జిల్లా పరిషత్‌లను విభజించేందుకు రాష్ట్ర ఉన్నతాధికారులు జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదే పద్దతులలో ప్రక్రియను పూర్తి చేసిన ఇరుజిల్లాల అధికారులు ఎన్నికల ప్రక్రియను రెండు జిల్లాల కలెక్టర్ల సారథ్యంలో చేపడుతున్నారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా పరిషత్‌లో ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కసరత్తు చేస్తున్న అధికారులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు నియమించిన నోడల్ అధికారి పరిషత్ ఎన్నికలకు సంబంధించిన పనులను ఆయా మండల అధికారులతో సమన్వ పరచుకుని ఖమ్మంలోని జిల్లా పరిషత్ అధికారులకు సమాచారాన్ని అందజేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ పరిషత్ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించేందుకు కసరత్తు పూర్తి చేసి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతులను తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల నిర్వహణ షెడ్యూల్డ్ తేదీని మరో రెండుమూడు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ సూచనా ప్రాయంగా విడుదల చేయడంతో దాదాపుగా ఆదే తేదీల్లో ఎన్నికలు జరగుతుయనే ప్రచారం జోరందుకుంది.

ఈ నెల 15,16,17 తేదీల్లో ఎన్నికల సిబ్బందికి శిక్షణ..
ఎన్నికల్లో విధులు నిర్వహించేందుకు సిబ్బందికి ఈనెల 15,16,17 తేదీలలో శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. ఈనెల 15,16 తేదీల్లో పీవోలు, ఏపీవోలకు ఆయా మండల కేంద్రాలలో జిల్లా, మండల పరిషత్ ఎన్నికల నియనిబంధనలపై శిక్షణ అందించనున్నారు. 17వ తేదీన రిటర్నింగ్ అధికారులకు జిల్లా స్థాయిలో శిక్షణ తరగతులను ఏర్పాటు చేసేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఎన్నికల నియమనిబంధనలకు సంబంధించిన కరదీపికలను ఇప్పటికే జిల్లా కేంద్రానికి చేరడంతో వాటిని మండల కేంద్రాలకు పంపించనున్నారు. బ్యాలెట్ పత్రాల ముద్రణకు సంబంధించిన ప్రింటింగ్ ప్రెస్‌ల ఎంపిక జిల్లా అధికారులు ఎంపిక చేశారు. జిల్లాలో ఎన్నికల విధులను నిర్వహించేందుకు పీవోలు, ఏపీవోలుగా 3850 మంది సిబ్బందిని నియమించి వారికి ఉత్తర్వులను జారీ చేశారు. మండల కేంద్రాల్లో ఎంపీడీవోలు ప్రత్యేక శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి పీవోలు, ఏపీవోలకు రెండు రోజుల పాటు శిక్షణ తరగతులను నిర్వహించనున్నారు.

ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీ, జడ్పీ చైర్మన్ల రిజర్వేషన్లు పూర్తి..
ఖమ్మం జిల్లాలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీ, జడ్పీ చైర్మన్ రిజర్వేషన్ల ప్రక్రియలను పూర్తి చేశారు. జిల్లాలోని 20 గ్రామీణ మండలాల్లో 289 ఎంపీటీసీలకు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 220 ఎంపీటీసీ స్థానాలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. అదే విధంగా ఖమ్మం జిల్లాలోని 20 ఎంపీపీలు, జడ్పీటీసీలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 21 ఎంపీపీలు, జడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లను పూర్తి చేశారు. ఈ రిజర్వేషన్‌ల ప్రక్రియను మండలాలకు మండల ప్రజా పరిషత్ చైర్మన్ పదవుల రిజర్వేషన్లు జిల్లా కలెక్టర్ కసరత్తును పూర్తి చేసి పంచాయితీరాజ్ కమిషనర్ నుంచి అనుమతులు తీసుకున్నారు. అలాగే రాష్ట్ర స్థాయిలో జిల్లా పరిషత్ చైర్మన్ పదవుల రిజర్వేషన్ల ప్రక్రియలను కమిషనర్ పూర్తి చేసి ప్రభుత్వ అనుమతులను పొందిన తరువాత రిజర్వేషన్లను గెజిట్ ద్వారా ప్రకటించారు. జిల్లాలో ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం పోలింగ్ కేంద్రాల ఎంపిక, ప్రతి ఎంపీటీసీ స్థానానికి 400కు తక్కువ కాకుండా ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం, మరికొన్ని 600ల పైన ఓటర్లు ఉన్న వారికి పోలింగ్ కేంద్రాలను కేటాయించారు. జిల్లాలో ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన కసరత్తును ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ ఆధ్వర్యంలో జిల్లా ప్రజా పరిషత్ అధికారులు కొనసాగిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల కమిషన్ ప్రకటించిన డ్రాప్ట్ నోటిఫికేషన్ ప్రకారం జిల్లాలో మూడు దశల్లో ఎన్నికలు జరగవచ్చు అనే ప్రచారం జరుగుతుంది.

320
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles