దేశంలో గుణాత్మక మార్పు కోసం సీఎం కేసీఆర్ కృషి..

Sun,April 14, 2019 01:51 AM

- అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శం
- పార్లమెంట్ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే హవా
- గులాబీ సైనికులకు కృతజ్ఞతలు..

మధిర, నమస్తేతెలంగాణ, ఏప్రిల్13: దేశంలో గుణాత్మక మార్పు కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం మధిర పట్టణంలోని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రజలు తనను ఆశీర్వదించారని, నాయకులు, కార్యకర్తలు కష్టపడ్డారని, పోలీసు సిబ్బంది, ఎన్నికల సిబ్బందికి ఓటరు మహాశయులకు ధన్యవాదాలు తెలిపారు. కొత్త, పాత తెడాలేకుండా అన్నదమ్ముల్లాగా కష్టపడి పనిచేశారని, సీఎం కేసీఆర్ ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా నన్ను పంపించినప్పుడు తక్కువ సమయం ఉన్నప్పటికీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి ప్రజల్లోకి తీసుకెళ్లారని తెలిపారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆయా సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతిఒక్కరికీ అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. దేశంలో గుణాత్మక మార్పు రావాలని సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారన్నారు. సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు తెలంగాణ రాష్ట్రంలోని 16 ఎంపీ సీట్లు విజయం సాధించడం ఖాయం అన్నారు. తెలంగాణలో ఈ ఎన్నికల్లో ప్రజలు మొత్తం టీఆర్‌ఎస్ వైపే మొగ్గుచూపారన్నారు. కేంద్రంలో కూడా మార్పు వస్తుందని, రావాల్సి అవసరం ఉందన్నారు.

మిగిలిన దేశాలతో పోల్చితే భారతదేశం చాలా వెనుకబడి ఉందని, దీనికి కారణం గత పాలకుల నిర్లక్ష్యమేనన్నారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి తాతా మధు మాట్లాడుతూ.. కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారని, దేశంలో కూడా మార్పు తీసుకురావాలని, అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో ఆదర్శంగా నిలపాలని సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. టీఆర్‌ఎస్ అభివృద్ధికి ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారని, కేసీఆర్ పిలుపు మేరకు ఖమ్మం జిల్లాలో పనిచేసిన గులాబీ సైనికులందరికీ కృజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ మధిర నియోజకవర్గ ఇన్‌చార్జి లింగాల కమలరాజు, నాయకులు బొమ్మెర రామ్మూర్తి, మొండితోక సుధాకర్, డాక్టర్ కోట రాంబాబు, మధిర ఏఎంసీ చైర్మన్ చావా రామకృష్ణ, అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, తుల్లూరి బ్రహ్మయ్య, దొండపాటి వెంకటేశ్వరరావు, మొండితోక జయాకర్, రంగిశెట్టి కోటేశ్వరరావు, బోగ్యం ఇందిర, చటారి రమాదేవి, మూడ్ ప్రియాంక, యన్నం కోటేశ్వరరావు, అయితం వెంకటేశ్వరరావు, దేవిశెట్టి రంగారావు, అరిగె శ్రీనివాసరావు, చిత్తారు నాగేశ్వరరావు, శీలం వీరవెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

321
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles