వైద్యుడి నిర్లక్ష్యంతో బాలింత పరిస్థితి విషమం

Sun,April 14, 2019 01:51 AM

మయూరిసెంటర్, ఏప్రిల్ 13 : గార్ల మండలం పుల్లూరు ప్రాంతానికి చెందిన శిరీష తొలి కాన్పుకోసం ఈ నెల 9వ తేదీన జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ రోడ్‌కు వెళ్లే మార్గంలో గల ఓ ప్రైవేట్ వైద్యశాలలో నిండు గర్భిణిగా చేరింది. వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం 10 వ తేదీన ఉదయం 11 గంటలకు శస్త్ర చికిత్స (పెద్ద ఆపరేషన్) నిర్వహించి మగబిడ్డకు పురుడుపోశారు. అనంతరం బాలింత శిరీషకు మెదడులో, శరీరంలో మార్పులు రావడం, బ్రెయిన్‌లో రక్తం గడ్డ కట్టడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయని శిరీష బందువులు పేర్కొన్నారు. ఈ అంశం పై సదరు వైద్యులను అడుగగా మెరుగైన వైద్య కోసం మరో వైద్య కార్పొరేట్ వైద్యశాలకు వెళ్లాలని సూచించగా శుక్రవారం అర్థరాత్రి శిరీషను ఆమె బంధువులు హైద్రాబాద్‌లోని కార్పొరేట్ వైద్యశాలకు తీసుకువెళ్లినట్లు బంధువులు పేర్కొన్నారు. హైద్రాబాద్‌లోని వైద్యులు శిరీష ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని రోజుకు ఖరీదైన వైద్యం అందించినప్పటికి కూడా గ్యారెంటీ చెప్పలేమని తెలుపగా బంధువులు ఆమెను తీసుకుని తీరుగు పయణమయ్యారని పేర్కొన్నారు. శిరీష ప్రాణానికి ప్రమాదంగా మారిన వైద్యుల నిర్లక్ష్యానికి నిదర్శనగా శనివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు బంధువు ఆందోళన నిర్వహించారు. దీంతో వన్‌టౌన్ పోలీసులు వైద్యశాల వద్ద మోహరించి శిరీష బందువులను సముదాయించారు. శిరీష భర్త జాను గుంటూరు ప్రాంతానికి చెందినవాడు.

ప్రైవేట్ వైద్యుని నిర్లక్ష్యమే కారణం...
- శిరీష మేనమామ వీరునాయక్
జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ రోడ్డుకు వెళ్లే ప్రాంతంలో గల ఓ ప్రైవేట్ వైద్యశాలలో మా కోడలు శిరీషను ఈ నెల 9వ తేదీన అడ్మిట్ చేశాం. ప్రైవేట్ వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించటం వల్లే నా కోడలుకు ఈ ప్రమాదం వచ్చింది. ప్రస్తుతం మా కోడలు కోమాలో ఉంది.

237
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles