ఈవీఎం మూడంచెల పటిష్ట భద్రత..

Sat,April 13, 2019 06:18 AM

ఖమ్మం, నమస్తే తెలంగాణ: ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పోల్డ్ ఈవీఎంల స్ట్రాంగ్ రూంలకు మూడంచెల పటిష్ట భద్రత కల్పించినట్లు కలెక్టర్, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఆర్‌వీ కర్ణన్ తెలిపారు. శుక్రవారం విజయ ఇంజినీరింగ్ కళాశాలలో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు, అభ్యర్థుల ఏజెంట్లు, ఎన్నికల సాధారణ పరిశీలకులు జీకే అరుణ్ సుందర్ త్యాలన్, పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ సమక్షంలో ఈవీఎంల స్ట్రాంగ్ రూంలకు సీల్ వేశారు. అనంతరం అభ్యర్థులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పారామిలటరీ బలగాలు, సాయుధ పోలీసు బలగాలతో పాటు, స్థానికి పోలీసు బలగాలతో 24 గంటల నిరంతర మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అభ్యర్థులు, అభ్యర్థుల ఏజెంట్లు మాత్రమే సందర్శన అనుమతి ఇవ్వడం జరుగుతుందని ఇతరులెవ్వరికీ కళాశాలలో అనుమతించబడదని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలను సజావుగా ప్రశాంత వాతావరణంలో నిర్వహణకు అభ్యర్థులు వివిధ రాజకీయ పార్టీలు సహకరించారని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ అనురాగ్ జయంతి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా రెవన్యూ అధికారి శిరీష, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు జే. శ్రీనివాసరావు, దశరథ్, శివాజీ, స్వర్ణలత, తెలంగాణ రాష్ట్ర సమితి తాళ్లూరి బ్రహ్మయ్య, భారతీయ జనతా పార్టీ నుంచి వాసుదేవరావు, విద్యాసాగర్‌రావు, ఇండియన్ కాంగ్రెస్ పార్టీ నుంచి జీ. శ్రీధర్, చైతన్య, ఇండిపెండెంట్, అభ్యర్థులు జీ. రమేష్, శ్రీనివాసరావు, వేలాద్రీ, నాగేశ్వరరావు, అర్జున్‌రావు, రామారావు, తదితర రాజకీయ పార్టీ నాయకులతో పాటు సహాయ రిటర్నింగ్ అధికారులు సబంధిత అధికారులు పాల్గొన్నారు.

299
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles