భారీ మెజార్టీతో నామా గెలుపు ఖాయం..

Sat,April 13, 2019 06:18 AM

వైరా, నమస్తే తెలంగాణ: ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గానికి గురువారం జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అత్యధిక మెజారిటీతో గెలుపొందడం ఖాయమని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. వైరాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఖమ్మం ఎంపీ స్థానంలోని ఓటర్లంతా టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టేందుకు కారు గుర్తుకు ఓటు వేశారని చెప్పారు. వైరా నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీకి ఓటర్లు అత్యధిక శాతం తమ ఓట్లు వేశారన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలు టీఆర్‌ఎస్‌ను ఖమ్మం ఎంపీ స్థానంలో గెలిపించనున్నారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపు కోసం నిరంతరం శ్రమించిన టీఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు, సానుభూతిపరులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా వైరా నియోజకవర్గంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించిన అధికారులకు, పోలీస్‌శాఖ సిబ్బందికి, అందుకు సహకరించిన నియోజకవర్గ ప్రజలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులైన ఓటర్లు మండే ఎండను సైతం లెక్కచేయకుండా పోలింగ్ బూత్‌ల వద్ద క్రమశిక్షణతో క్యూలైన్‌లో నిల్చొని టీఆర్‌ఎస్‌కు ఓటు వేయడం అభినందనీయమన్నారు.

262
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles