డీఈఓ ఆఫీస్ ఏడీగా బాధ్యతలు చేపట్టిన గుణశీల

Sat,April 13, 2019 06:17 AM

ఖమ్మం ఎడ్యుకేషన్: జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీ)గా గుణశీల బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం కార్యాలయ సిబ్బంది సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. సూర్యాపేట డీఈఓ కార్యాలయంలో సూపరిండెంట్‌గా పనిచేస్తున్న క్రమంలో ఈ నెల 2వ తేదీన ఏడీగా పదోన్నతి పొందారు. ఖమ్మం డీఈఓ కార్యాలయంలో ఏడీగా మహిళా అధికారిణులు ఎవరూ విధులు నిర్వర్తించలేదు. ఏడీగా మహిళా అధికారిణి బాధ్యతలు చేపట్టడం తొలిసారి. ఏడీకి కార్యాలయ సిబ్బంది జీఎస్ ప్రసాద్, మాధవరావు, శేషుకుమార్, ఎం శ్రీనివాస్, ఎన్ శ్రీనివాస్, నగేష్, కిషోర్, కిరణ్, షాహిన్, ఉషా, శశికుమారి, సంధ్య, శ్రీదేవి, రాధా తదితరులు అభినందనలు తెలిపారు.

పుస్తకాల విక్రయాలకు ఇండెంట్లు అందజేయాలి..
జిల్లాలోని ప్రైవేట్ పాఠ్యపుస్తకాలు విక్రయించే యాజమానులు 2019-20 విద్యాసంవత్సరానికి మీడియంల వారీగా ఇండెంట్లు సిద్ధం చేసి అర్హత పత్రాలతో ఈ నెల 16వ తేదీలోగా డీఈఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ మదన్‌మోహన్ సూచించారు. ఇతర వివరాలకు ఆఫీస్‌లో సంప్రదించాలని కోరారు.

300
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles