గురుకులాలతో మంచి భవిత

Sat,April 13, 2019 06:17 AM

-రాష్ట్రస్థాయి వార్షికోత్సవంలో డిప్యూటీ సెక్రటరీ డాక్టర్ పద్మావతి
రఘునాథపాలెం, ఏప్రిల్ 12: గురుకులాల సొసైటీ కల్పించే సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ మంచి లక్ష్యంతో చదువుకోవాలని గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ డాక్టర్ కే.పద్మావతి విద్యార్థులకు పిలుపునిచ్చారు. తెలంగాణ గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలల రాష్ట్ర స్థాయి వార్షికోత్సవాన్ని శుక్రవారం మండల కేంద్రం రఘునాథపాలెం కళాశాల ఆవరణంలో నిర్వహించారు. సూపర్ నోవా-2019 పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం గురుకుల సొసైటీ బలోపేతంగా ముందుకు సాగుతోందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 22 కళాశాలలను ఏర్పాటు చేసి ప్రైవేటు కళాశాలలకు దీటుగా మెరుగైన ఫలితాలను సాధిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొలిరోజు ఇటీవల విడుదలైన డిగ్రీ కళాశాలల ఫలతాలపై విశ్లేషించుకున్నారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాలల ఓఎస్‌డీ లక్ష్మయ్య, ఖమ్మం ఆర్‌సీ ఏవీ రాజ్యలక్ష్మి, ప్రిన్సిపాల్ జే.రమేష్ రెడ్డి, మణుగూరు ప్రిన్సిపాల్ బీ.రవి, దమ్మపేట ఓ.భాస్కర్ రెడ్డి, పీ.వెంకటనారాయణ, అన్ని డిగ్రీ కళాశాలల అధ్యాపకులు పాల్గొన్నారు.

228
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles