పటిష్ట భద్రతతో పోలింగ్ ప్రశాంతం..

Fri,April 12, 2019 01:08 AM

- సమస్యాత్మక కేంద్రాలలో భారీ బందోబస్త్..
- కొణిజర్లలో సిబ్బందికి మజ్జిగా ప్యాకెట్లను పంపిణీ చేసిన సీపీ
- ప్రశాంతంగా జరగడంతో ఊపిరి పీల్చుకున్న జిల్లా పోలీస్ యంత్రాంగం

ఖమ్మం క్రైం: పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ పటిష్టమైన భద్రత మధ్య ప్రశాంతంగా ముగిసింది. జిల్లా పోలీసులు గతకొద్ది రోజులుగా ప్రణాళికను సిద్ధం చేసి దానిని పకడ్బందీగా అమలు పర్చడంలో సఫలీకృతమయ్యారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 1365 పోలింగ్ కేంద్రాలలో సాధారణ పోలీసులు, ఏఆర్ పోలీసులతో పాటు జార్ఖండ్, మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన కేంద్ర బలగాలు, పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ)తో భారీ బందోబస్త్ నిర్వహించి ఎక్కడా అవాంఛీయమైన సంఘటనలు జరుగకుండా పటిష్టమైన భద్రతాచర్యలు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతమైన వాతావరణంలో పూర్తికావడంతో జిల్లా పోలీస్ యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. 1365 పోలింగ్ స్టేషన్లలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో భారీస్థ్ధాయిలో కేంద్ర బలగాలను మొహరించారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిధిలో ఉండి గత ఎన్నికల సమయంలో అల్లర్లకు పాల్పడిన, నేరచరిత్ర ఉన్న వ్యక్తులు రౌడీషీటర్లను, అనుమానిత వ్యక్తుల జాబితాను సిద్ధం చేసి వారి కదలికపై నిఘా ఉంచారు. దీంతో ఎక్కడా ఏ చిన్న సంఘటన జరిగినా నిఘా వర్గాల ద్వారా సమాచారం తెలుసుకుని అప్రమత్తం అయ్యారు. అంతేకాకుండా ఆయా పోలింగ్ కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి పోలింగ్ ప్రక్రియను నిర్వహించారు. వెబ్‌కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు స్థ్ధానిక పరిస్థితులను తెలుసుకున్నారు. పోలింగ్ సరళితో పాటు ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.

ఎన్నికల సంఘం విధించిన నియమ నిబంధనల ప్రకారం పోలింగ్ కేంద్రాల వద్ద పలు రకాల ఆంక్షలు విధించారు. పోలింగ్ కేంద్రాల నుంచి సుమారు వంద మీటర్ల దూరం వరకు ఎక్కువ మంది గుమికూడకుండా చర్యలు తీసుకున్నారు. పోలింగ్ చిట్టీలను నిశితంగా పరిశీలించి చిట్టీలు స్పష్టంగా ఉన్నవారిని మాత్రమే కేంద్రాలకు అనుమతించారు. కొన్ని ప్రాంతాలలో ఒక్క పాఠశాల అవరణంలోనే ఎక్కువ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఎక్కువ మంది పోలీస్ సిబ్బందిని నియమించి ఆంక్షలను తూచా తప్పకుండా అమలు చేశారు. జిల్లావ్యాప్తంగా రూట్ మొబైల్ పార్టీలు, ైస్టెకింగ్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పోలీస్ అధికారులు ముందుకుసాగారు. 25 బృందాల ైస్టెకింగ్‌ఫోర్స్, 5 బృందాల స్పెషల్ ైస్టెకింగ్ ర్స్ బృందాలను ఏర్పాటు చేశారు. పోలీస్ కమిషనర్ తఫ్సీర్‌ఇక్బాల్ జిల్లావ్యాప్తంగా ఉన్న పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ ముందుకుసాగారు. నగరంలోని సిద్దారెడ్డి కాలేజ్‌లోని పోలింగ్ కేంద్రాలలో ఉన్న పోలీస్ బందోబస్తు, పోలింగ్ సరళిను పరిశీలించారు. ఖమ్మం నగరంలోని పలు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్‌తో కలిసి సీపీ తఫ్సీర్ ఇక్బాల్ సందర్శించారు. వైరా డివిజన్‌లోని కొణిజర్లలో సీపీ పోలింగ్ కేంద్రాలను సందర్శించి పరిస్థితులను అధికారులను ఆడిగి తెలుకున్నారు. పోలింగ్ బందోబస్‌లో ఉన్న సిబ్బందికి మజ్జిగా ప్యాకెట్లను పంపిణీ చేశారు. పాలేరు నియోజకవర్గలోని వివిధ పోలింగ్ కేంద్రాలను అడిషనల్ డీసీపీ మురళీధర్ పరిశీలించారు. వైరా, మధిర నియోజకవర్గంలోని పల్లిపాడు, తల్లాడ, చింతకాని మండలంలోని నేరడ గ్రామంలో ఉన్న పోలింగ్ కేంద్రాలను అడిషనల్ డీసీపీ (ఆడ్మిన్) ఇంజరావు పూజ సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.

239
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles