ఓటర్లకు నామా నాగేశ్వరరావు కృతజ్ఞతలు..

Fri,April 12, 2019 01:07 AM

ఖమ్మం, నమస్తే తెలంగాణ: ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఓటర్లకు ఎన్నికల ప్రచారంలో భాగంగా తన విజయం కోసం కృషి చేసిన రాష్ట్ర, జిల్లా టీఆర్‌ఎస్ నాయకత్వానికి, ప్రజలకు, మీడియా మిత్రులకు, ప్రజాప్రతినిధులకు నామా నాగేశ్వరరావు ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా అహోరాత్రులు కార్యకర్తలు శ్రమిచారన్నారు. ఖమ్మం పార్లమెంట్‌ను టీఆర్‌ఎస్ గెలుచుకొని సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు. సారు.. కారు.. పదహారు... కేంద్ర సర్కారు.. అనే నినాదంతో విస్తృతంగా ముందుకు పోవడం జరిగిందన్నారు. రాష్ట్ర నాయకత్వం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఖమ్మంలోనే ఉండి అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తూ ముందుకు నడిపించారని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం గడిచిన ఐదేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఖమ్మం పార్లమెంట్‌లో విజయానికి దోహదపడతాయన్నారు. ఈ ఎన్నికలో మునుపెన్నడూ లేనివిధంగా ఓటర్ల నుంచి అనూహ్య రీతిలో టీఆర్‌ఎస్ వైపు స్పందన కనిపించిందని, అందుకు కేసీఆర్ నాయకత్వమేనని స్పష్టం చేశారు. ప్రజల ఆశీర్వాదంతో తాను పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన తరువాత కేసీఆర్ నాయకత్వలో ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. అంతేకాకుండా తెలంగాణ ప్రజల సంక్షేమ కోసం టీఆర్‌ఎస్ తరుపున కేంద్ర పభుత్వంపై ఒత్తిడి తేవడం జరుగుతుందని చెప్పారు.

ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని, విశ్వాపాన్ని నిలబెట్టుకుంటానన్నారు. గెలుపు కోసం కృషి చేసిన ప్రతిఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. నామా గురువారం ఖమ్మం నగరంలోని నెహ్రునగర్‌లో ఉన్న తన నివాసం నుంచి ఉదయం 8 గంటలకు కుటుంబ సభ్యులు, సోదరులు, తల్లి నామా వరలక్ష్మి మరియు సోదరి తులిశమ్మలు వెంటరాగా మూకుమ్మడిగా వెళ్లి కవితా కళాశాలలోని పోలింగ్‌బూత్‌లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన భార్య చిన్నమ్మ, సోదరుడు రామారావు, కుమారులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఆయన వెంట వచ్చారు. కళాశాల పోలింగ్ బూత్‌లో వ్యాంప్ లేకపోవడంతో నామా వరలక్ష్మి నడవలేక వీల్‌చైర్‌లో కూర్చున్నారు. ఆ కుర్చీని మెట్ల వద్ద నామాతో పాటు అతని కుటుంబ సభ్యులే ఎత్తుకొని పోలింగ్ బూత్ వరకు తీసుకొని పోవడం అక్కడ ఉన్నవారిని ఆలోచింపజేసింది. సాధారణ ఓటరులాగానే అందరూ క్యూలో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నామా నాగేశ్వరరావు ఓటు వేయగానే ఆయన భార్య చిన్నమ్మ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుందో నామా నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు గురువారం పోలింగ్ సందర్భంగా కవిత కళాశాలలో జనానికి చూపించారు.

279
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles