ప్రశాంతంగా పోలింగ్

Fri,April 12, 2019 01:07 AM

ఖమ్మం, నమస్తేతెలంగాణ : ఖమ్మం లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రారంభమైన పోలింగ్ ఎలాంటి అవాంతరాలు లేకుండా కొనసాగింది. ఖమ్మం జిల్లాలో గురువారం ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. జిల్లా ఎన్నికల అధికారి, పొలీసు అధికారులు తీసుకున్న పటిష్టమైన చర్యలతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 75.61శాతం పోలింగ్ నమోదైంది. ఖమ్మం శాసనసభ నియోజకవర్గంలో 65.44, పాలేరులో 82.95శాతం, మధిరలో80.86 శాతం, వైరాలో 78.89శాతం, సత్తుపల్లిలో77.63, కొత్తగూడెం నియోజకవర్గంలో65.94, అశ్వారావుపేట నియోజకవర్గంలో 77.58 శాతం పోలింగ్ నమోదైంది. అక్కడక్కడ ఈవీఎంలు మొరాయించినప్పటికీ అధికారులు సకాలంలో స్పందించి సమస్యలను పరిష్కరించటంతో ఓటింగ్ సజావుగా సాగింది. వృద్ధులు, వికలాంగులు, యువత పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

దివ్యాంగుల పోలింగ్ శాతం పెంచడం కోసం భారత ఎన్నికల సంఘం పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు ఉచిత రవాణా సౌకర్యాన్ని కూడా కల్పించింది. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద దివ్యాంగుల కోసం వీల్ చైర్లను అందుబాటులో ఉంచారు. అదే విధంగా మహిళల కోరకు ప్రత్యేకమైన పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి పోలింగ్ శాతం పెరిగెల చర్యలు తీసుకున్నారు. ఉదయం 7 గంటలకే జిల్లాలోని అన్ని చోట్ల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమయింది. కొణిజర్ల మండల కేంద్రంలో142, 147 పోలింగ్ బూత్‌లలో ఈవీఎంలు మోరాయించాయి. నేలకొండపల్లి మండలం పైనంపల్లిలో 259వ బూత్‌లో ఈవీఎం మోరాయించగా అధికారులు వెంటనే మరోక ఈవీఎంలను ఏర్పాటు చేశారు. ఏన్కూరు మండలం మూలపోచారం గ్రామంలో పోడు భూములకు పట్టాలు ఉన్నప్పటికి అటవీ అధికారులు భూమిని సాగు చేయనియడంలేదని, అధికారుల వ్యవహారశైలికి నిరసనగా గ్రామస్తులు ఓట్లను బహిష్కరించారు. కొన్ని చోట్ల ఈవిఎమ్‌లు మోరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా మొదలైంది. జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్, పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ కలెక్టరేట్ నుండి ఎన్నికల ప్రక్రియను పరిశీలించారు.

ఎండకు బయటికి రాని ఓటర్లు....
మాడలు మండే విధంగా ఎండలుండటంతో ఓటర్లు ఉదయాన్నే అధిక సంఖ్యలో పోలింగ్ బూత్‌లకు చేరుకున్నారు. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రావడం జరిగింది. ఆ తరువాత మధ్యాహ్నా సమయంలో ఓటర్లు ఓటు వేయడానికి ఆసక్తి చూపలేదు. తిరిగి సాయంత్రం 3 గంటల తరువాత ఓటర్ల రాక ప్రారంభమైంది. ఖమ్మం జిల్లాలో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నాం వరకు మందకొడిగా కొనసాగింది. మధ్యాహ్నాం తరువాత ఓటర్లు అధిక సంఖ్యలో పోలింగ్ బూతులకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 9 గంటలకు 8.2 శాతం మంది ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 11 గంటలకు 24.2 శాతం, మధ్యాహ్నాం 1 గంటకు 41.65 శాతం, 3 గంటలకు 54.80 శాతం, 5 గంటలకు 67.92 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

స్ట్రాంగ్ రూంకు ఈవీఎమ్‌లు...
ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే ఈవిఎమ్‌లను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం నియోజకవర్గాలలోని ఈవీఎంలను గురువారం రాత్రి ఖమ్మం సమీపంలోని కౌంటింగ్ కేంద్రమైన విజయ ఇంజనీరింగ్ కళాశాలకు తరలించారు.

189
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles