పోలింగ్ కేంద్రాల్లో పటిష్ట భద్రత

Thu,April 11, 2019 12:34 AM

ఖమ్మం క్రైం, ఏప్రిల్ 10 : జిల్లాలో గురువారం జరగనున్న లోక్‌సభ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ప్రణాళికలతో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని 5నియోజకవర్గాల్లో లోక్‌సభ ఎన్నికల విధి నిర్వహణలో ఉన్న పోలీస్ సిబ్బంది చేయాల్సిన విధివిధానాలను బుధవారం జిల్లా కేంద్రంలోని సెయింట్ జోసెఫ్, రూరల్ పరిధిలో ఉన్న రామ్‌లీల ఫంక్షన్ హాల్లో, వైరాలోని మార్కెట్ యార్డ్‌లో ఎన్నికల బందోబస్త్ నిర్వహణపై ఆయా డివిజన్ పోలీస్ అధికారులు ఏర్పాటు చేసిన ఎన్నికల ఆవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా సీపీ తఫ్సీర్ ఇక్బాల్ మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రతిఒక్కరూ పోలీస్ సిబ్బంది కష్టపడి పనిచేశారని, అదే రీతిలో లోక్‌సభ ఎన్నికల్లో ప్రదర్శించి ఇన్స్‌డెంట్ ఫ్రీ ఎన్నికలుగా విజయవంతం చేయాలని సూచించారు. పోలింగ్ బూత్‌లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతిఒక్కరూ నిబద్ధతతో పనిచేయాలన్నారు. అడిషనల్ డీపీపీ మురళీధర్, అడిషనల్ డీసీపీ(అడ్మిన్) పూజా, ఏఆర్ అడిషనల్ డీసీపీ శ్యామ్‌సుందర్, ట్రైనీ ఐపీఎస్ అధికారి వినిత్‌తో పాటు ఒక్కొక్క నియోజకవర్గానికి ఇద్దరు ఏసీపీ అధికారుల ఆధ్వర్యంలో ఎన్నికలు శాంతి భద్రతల నడుమ పర్యవేక్షించాలని ఆయన తెలిపారు. ఎన్నికల్లో ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే ఆయా ప్రాంతాలకు చేరుకునే విధంగా రూట్ మొబైల్ పార్టీ, ైస్టెకింగ్ ఫోర్స్ మరింత వేగవంతంగా స్పందించే విధంగా ప్రత్యేక ప్రణాళికలతో సిబ్బందికి విధులు కేటాయించడం జరిగిందన్నారు. విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది ఎట్టి పరిస్థితిలో పోలింగ్ కేంద్రాల సమీపంలో ప్రజలు గుంపులు గుంపులుగా చేరకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. ఆయా పార్టీలకు చెందిన నాయకులు ఓటర్లను ప్రలోభాలకు, ఆందోళన చేయకుండా ప్రశాంతమైన వాతావరణంలో వారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఆయా ప్రాంతాల్లో స్వేచ్ఛాయుత వాతావరణం కలిపించాలన్నారు.

పోలింగ్ సరళిలో భాగంగా పోలీస్ సిబ్బందికి అప్పగించిన బాధ్యతలు మాత్రమే సమన్వయస్ఫూర్తితో సక్రమంగా విధులు నిర్వహించాలని సూచించారు. అనవసరమైన విషయాలలో పోలీసులు, సిబ్బంది తలదూర్చవద్దని ఆదేశించారు. జిల్లాలో ఉన్న సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో అదనపు సెంట్రల్ పోలీస్ ఫోర్స్‌ను వినియోగిస్తున్నట్లు సీపీ తఫ్సీర్ ఇక్బాల్ సూచించారు. పోలింగ్ స్టేషన్‌లలో ఎప్పటికప్పుడు స్థానికంగా ఉన్న పరిస్థితులను పోలింగ్ సరళిని పర్యవేక్షించాలన్నారు. ఇప్పటికే సమస్యాత్మక గ్రామాలకు బలగాలు చేరుకున్నాయని, అధికారుల నేతృత్వంలో పకడ్బందీగా బందోబస్త్ ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో 20చెక్‌పోస్ట్‌లు, 124 రూట్ మొబైల్స్, 25 ైస్ట్రెకింగ్ ఫోర్స్, 5 స్పెషల్ ైస్ట్రెకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. విధుల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సెంట్రల్ ఫోర్స్‌లో జార్ఖాండ్, మధ్యప్రదేశ్, ఐటీబీపీ సెంట్రల్ ఫోర్స్‌కు భాష ఇబ్బంది లేకుండా గైడ్ చేసేందుకు పోలీస్ సిబ్బందిని నియమించినట్లు సూచించారు. ప్రధానంగా ఓటర్లతో సమన్వయం పాటిస్తూ సమస్యలు ఉత్పనం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను సీపీ తఫ్సీర్ ఇక్బాల్ ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ మురళీధర్, అడిషనల్ డీసీపీ(అడ్మిన్) పూజ, ఏఆర్ అడిషనల్ డీసీపీ శ్యామ్‌సుందర్, ట్రైనీ ఐపీఎస్ అధికారి డాక్టర్ వినీత్, ఎస్‌బీ ఏసీపీ సత్యనారాయణ, ఏసీపీలు ఘంటా వెంకట్రావు, రామోజీ రామేష్, ప్రసన్న కుమార్, ఏఆర్ ఏసీపీలు విజయ్‌బాబు, రీయాజ్, సీఐలు రమేష్, నరేందర్, షుకూర్, సాయిరమణ, మురళీ, రమాకాంత్, అంజలి, శివరామయ్య తదితరులు పాల్గొన్నారు.

247
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles