ప్రచారానికి తెర..

Wed,April 10, 2019 01:03 AM

- చివరి రోజు ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించిన నేతలు
- ప్రజల గుండెల్లో నిలిచిన గులాబీ జెండా..
- కేసీఆర్ సార్ రాకతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం
- కాంగ్రెస్ ప్రచారానికి స్పందన కరువు..
- కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారంలో కనిపించని భట్టీ..
- పార్లమెంటు ఎన్నికల్లో ఒంటరైన రేణుక..
- వామ పక్షాల ప్రచారం అంతంత మాత్రమే..

ఖమ్మం ప్రధానప్రతినిధి, నమస్తే తెలంగాణ: పార్లమెంటు ఎన్నికల ప్రచార హోరు ముగిసింది. పక్షం రోజులుగా ప్రజలతో మమేకం అవుతూ గులాబీ శ్రేణులు విస్తృత ప్రచారం నిర్వహించారు. అన్ని వర్గాల ప్రజలు గులాబీ జెండాను గుండెలకు హత్తుకున్నారు. అభ్యర్థి, నేతలు ఏ గ్రామానికి వెళ్లినా అపూర్వ స్వాగతం లభించింది. ఎంపీ అభ్యర్థి నామా, ఎమ్మెల్సీ పల్లా, మాజీ మంత్రి తుమ్మల, ఎంపీ పొంగులేటి, ఎమ్మెల్యేలు అజయ్, రాములునాయక్, సండ్ర, కందాళ, వనమాలు టీఆర్‌ఎస్‌కు భారీ మెజార్టీయే లక్ష్యంగా ప్రచారం నిర్వహించారు.

పార్లమెంటు ఎన్నికల ప్రచార హోరు ముగిసింది. పక్షం రోజుల పాటు ప్రజల మనస్సులను గెలుసుకునేందుకు అభ్యర్థులు తమ ప్రచార హోరును కొనసాగించారు. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు ప్రచార కార్యక్రమాలు ముగిశాయి. దీంతో అభ్యర్థులు మండలాల వారీగా ప్రధాన నాయకులు, కార్యకర్తలను అప్రమత్తం చేసే పనిలో నిమగ్నమయ్యారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి చేసిన ప్రచారంతో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో గులాబీ జెండా ప్రజల గుండెల్లో నిలిచి పోయింది. గతంతో మాయ మాటలతో గెలిసి మోసం చేసిన కాంగ్రెసుకు తగిన బుద్ధి చెప్పేందుకు జిల్లా ప్రజలు మానసికంగా ఇప్పటికే సిద్ధమయ్యారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే అభ్యర్థి నామా నాగేశ్వరరావును గెలిపించేందుకు దోహదం చేస్తున్నాయి. టీఆర్‌ఎస్ పార్టీ తరఫున నామినేషన్ వేసిన నాటి నుంచి ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రధాన నాయకులు టీఆర్‌ఎస్ గెలుపు నిత్యం కృషి చేశారు. ఖమ్మం పార్లమెంటు ఎన్నికల ఇన్‌చార్జీగా స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండటంతో జిల్లాలోని ప్రచారం చేపట్టేందుకు పార్టీ రాష్ట్రప్రధానకార్యదర్శి, మండలి విప్ పల్లా రాజేశ్వరరెడ్డి స్వయంగా రంగంలోకి దిగి ప్రచారాన్ని నడిపించారు. అన్ని నియోజక వర్గాలలోని గ్రామస్థాయి నాయకుల నుంచి జిల్లా, రాష్ట్రస్థాయి నాయకులు, ప్రజా ప్రతినిధులులను సమన్వయం చేసి ప్రతి పక్ష పార్టీలకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. ప్రచారంలో టీఆర్‌ఎస్ నాయకులు తమదైన శైలిలో కొనసాగించారు. దీంతో పార్లమెంటు పరిధిలో అన్ని అసెంబ్లీ నియోజక వర్గాలలో నామా నాగేశ్వరరావు వెళ్లారు. దీంతో ఎక్కడా చర్చ జరిగినా టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపు ఖాయమైయింది మెజార్టీ లెక్క వేయాలి అనే వాదనలు వినిపిస్తున్నాయి.

కేసీఆర్ సార్ రాకతో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం..
ఖమ్మం పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపు ఖాయమనే ప్రచారం రాజకీయ, సామాజిక విశ్లేషకుల్లో విస్తృతంగా సాగుతుంది. పార్లమెంటు నియోజక వర్గం ఇన్‌చార్జీగా ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా బాధ్యతలు స్వీకరించడంతో ప్రతిపక్షాలు ప్రచారంలో చేతులు ఎత్తేశాయి. ప్రచారంలో టీఆర్‌ఎస్ ప్రధాన నాయకులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర మాజీ, ప్రస్తుత ప్రజా ప్రతినిధిలు ప్రచారాన్ని హోరెత్తించారు. పక్షం రోజుల పాటు సాగిన ప్రచారంలో ఈనెల 4వతేదిన జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. టీఆర్‌ఎస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు కేంద్ర రాజకీయాలలో టీఆర్‌ఎస్ అనుసరించాల్సిన విధానాలను ప్రజలకు వివరించారు. గత 67 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ , బీజేపీలు ప్రజలను ఎలా మోసం చేశారో.. దేశంలో ఉన్న సహజ వనరుల వినియోగంలో ఏవిధంగా విఫలమైయ్యారో వివరించారు. రానున్న పార్లమెంటులో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పడితే తెలంగాణ రాష్ట్రం హక్కులు, నీళ్లు, ఇతర నిధులు ఏవిధంగా సాధించవచ్చు అనే అంశాలను ప్రజలకు వివరంచారు. జిల్లాలో టీఆర్‌ఎస్ శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు.

భారీ బహిరంగ సభ విజయవంతం కావడంతో ప్రతి పక్షాలు కళ్లు తేలేశాయి. బహిరంగ సభ విజయంతం కావడంతో టీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. ప్రచారాన్ని టీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో అభ్యర్థి నామా నాగేశ్వరరావు హోరెత్తించారు. జిల్లాలో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, నూకల నరేష్‌రెడ్డి, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం ఎమ్యెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, వైరా ఎమ్మెల్యే రాములునాయక్, మాజీ ఎమ్యెల్యేలు జగలం వెంకట్రావు, మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లు, యూనిస్ సుల్తాన్, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, కొత్తగూడెం ఎమ్యెల్యే వనమా వెంకటేశ్వరరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, సతుపల్లి టీఆర్‌ఎస్ ఇన్‌చార్జీ, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, మధిర ఇన్‌చార్జీ లింగాల కమల్‌రాజు, జిల్లా పరిషత్ చైర్మన్ బరపటి వాసుదేవరావు, గ్రంథాయల చైర్మన్ ఖమర్, మేయర పాపాలాల్, టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు బొమ్మర రామ్మూర్తి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గడిపల్లి కవిత, ఖమ్మం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్‌జేసీ కృష్ణ, తుల్లూరి బ్రహ్మయ్య, స్వర్ణకుమారి, గాయత్రి రవి ప్రచారం నిర్వహించారు. వీరితో పాటు జిల్లాలోని ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు ప్రచారంతో ప్రజలను చైతన్యం చేశారు.

పసలేని కాంగ్రెస్ ప్రచారం...
పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకారం పసలేకుండా పోయింది. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తున్న మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరికి సహకరంచే ప్రధాన నాయకులే దిక్కులేకుండా పోయారు. జిల్లాలో గెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతన్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, జాతీయ స్థాయిలో టీఆర్‌ఎస్ ఆవశ్యకతను గుర్తించిన వారు టీఆర్‌ఎస్ చేరారు. అదేవిధంగా జిల్లాలో సీనియర్ నాయకులుగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి బీజేపీలో చేరడంతో జిల్లాలో ప్రధాన నాయకులు లేకపోవడంతో కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారం సప్పగా సాగింది. జిల్లాలో మధిర నియోజక వర్గంనుంచి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే , సీఎల్‌పీ నాయకులు మల్లు భట్టి విక్రమార్క ప్రచారంలో కనిపించలేదు. రేణుకాచౌదరి ఏకపక్ష నిర్ణయాలతో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఖమ్మంలో టీఆర్‌ఎస్ ప్రచారం ముమ్మరంగా కొనసాగుతున్నప్పటికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రచారకులు జిల్లాలో పర్యటించక పోవడంతో రేణుక నైరాశ్యంలో మునిగిపోయారు. తెలంగాణ వ్యాప్తంగా పలు పార్లమెంటు నియోజకవర్గాలలో జాతీయస్థాయి నాయకులు ప్రచారం నిర్వహించారు.

కానీ ఖమ్మం పర్యటించక పోవడంతో ఇక్కడ గెలవలేమనే సంకేతాలు వారికి అందినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే జిల్లాలో బలమైన ప్రత్యర్థిగా రేణుక నిలుస్తుందని, భారీ బహరంగ సభలను నిర్వహించి జాతీయ నాయకులు వస్తారని భావించినప్పటికీ వారు ఎవరు ఖమ్మం వైపు చూడలేదు. ఎన్నికల్లో పోటీ చేశాం కాబట్టీ ఏదో నామమాత్రం ప్రచారం నిర్వహించి మమా అనిపించారు. ప్రధాన నాయకులు ఎవరు లేకపోవడంతో రేణుక ప్రచారంలో వెనక పడ్డారు. సంభాని చంద్రశేఖర్ మాత్రమే ప్రచారంలో పాల్గొన్నారు. దీంతో రేణుకాచౌదరి ఓటమి భయంతో ప్రచారంలో చేతులు ఎత్తి వేశారనే చెప్పవచ్చు. టీఆర్‌ఎస్ అభ్యర్థికి నామా నాగేశ్వరరావుకు జిల్లాలో సబ్బండ వర్గాలు మద్దతు తెలపడంతో రేణుక తరుపున ప్రచారం నిర్వహించే వారే కరవయ్యారు.

296
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles