మహబూబాబాద్ టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థిగా కవిత నామినేషన్

Fri,March 22, 2019 11:40 PM

మహబూబాబాద్, నమస్తే తెలంగాణ, మార్చి 22: మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత శుక్రవారం ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్, డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిలతో కలిసి శుక్రవారం మధ్యాహ్నం 1.00 గంటకు నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం ఉదయం కురవి వీరభద్రస్వామిని దర్శించుకొని మహబూబాబాద్‌లో గల కవిత గృహంలో భర్త భద్రునాయక్‌తో కలిసి పూజలు నిర్వహించారు. అదేవిధంగా మహబూబాబాద్ కవిత నివాసంలో సందడి నెలకొంది. గురువారం రాత్రి హైదరాబాద్‌లో కవితకు ఎంపీ టికెట్ ఖరారైనట్లు ప్రకటించడంతో మహబూబాబాద్‌కు ముఖ్య కార్యకర్తలు, నాయకులు ఆమె ఇంటి వద్దకు చేరుకుని కవితకు శుభాకాంక్షలు తెలిపారు. నామినేషన్ వేసేందుకు డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్, మహబూబాబాద్ చేరుకోవడంతో కార్యకర్తల్లో ఉత్తేజం నెలకొంది. మహబూబాబాద్ డోర్నకల్, ఇల్లెందు నియోజకవర్గాల నుంచి భారీగా కార్యకర్తలు నాయకులు తరలిరావడంతో కవిత నివాసం కిక్కిరిసిపోయింది. నామినేషన్ వేసేందుకు వెళ్తున్న ఎంపీ అభ్యర్థితో కలిసి నామినేషన్ సెంటర్ వరకు భారీగా కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు.

252
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles