ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహిద్దాం..

Fri,March 22, 2019 11:40 PM

కామేపల్లి, మార్చి 22 : త్వరలో జరగనున్న ఎంపీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేందుకు ప్రజలందరూ కృషి చేయాలని ఖమ్మం రూరల్ ఏసీపీ రామోజీ రమేష్ అన్నారు. ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం మండలంలోని మద్దులపల్లి, ముచ్చర్ల, గోవింద్రాల, పండితాపురం గ్రామాల్లో కేంద్ర సాయుద బలగాలతో కలిసి కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా రామోజీ రమేష్ మాట్లాడుతూ.. వచ్చే పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు వేయాలన్నారు. ప్రజాస్వామ్యంలో కీలకమైన ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రతిఒక్కరూ నిర్భయంగా ఓటు వేయాలన్నారు. అవాంచనీయ సంఘటనలకు పాల్పడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. తమ పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నా వెంటనే సంబంధింత పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలన్నారు. మండలంలోని సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు ఆయన తెలిపారు. గ్రామాల్లో ఏలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా గ్రామస్తులు, ప్రజాప్రతినిధులతో పాటు అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని ఆయన ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో సీఐ సాంబరాజు, ఎస్సై తిరుపతిరెడ్డి, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

175
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles