ఖమ్మం ఫార్మసీలో క్యాంపస్ ఇంటర్వ్యూలు

Fri,March 22, 2019 01:36 AM

ఖమ్మం ఎడ్యుకేషన్, మార్చి 21 : ఖమ్మం నగరంలోని ఖమ్మం కాలేజి ఆఫ్ ఫార్మసీలో గురువారం దివీస్ ల్యాబ్ సంస్ధ ఆధ్వర్యంలో బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ ఉత్తీర్ణులైన విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ పోట్ల ఏసయ్య చౌదరి మాట్లాడుతూ విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకోవాలని, నైపుణ్యాలు కలిగిన వారికి ఉద్యోగవకాశాలు ఉన్నాయన్నారు. వివిధ దశల్లో నిర్వహించిన ప్రక్రియల్లో 100మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ బి సాంబశివరావు, అధ్యాపకులు, కంపెనీ ప్రతినిధులు నాగరాజు, ఫణికుమార్, అప్పలనాయుడు, అమర్‌నాథ్ పాల్గొన్నారు.

291
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles