ఉత్కంఠభరితంగా సాగుతున్న కబడ్డీ పోటీలు

Fri,March 22, 2019 01:36 AM

వేంసూరు, మార్చి 21 : కందుకూరు శ్రీ వేంకటేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల స్థాయిలో నిర్వహిస్తున్న మహిళా కబడ్డీ పోటీలు గురువారం కూడా కొనసాగాయి. రెండో రోజు పోటీలను తిలకించేందుకు ప్రేక్షకులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. మహిళలు ఆడే కబడ్డీ పోటీలు పాయింట్లు తెచ్చే ప్రయత్నంలో ప్రేక్షకులు ఇరుజట్లకు మద్దతు తెలుపుతూ చప్పట్లతో క్రీడాకారులను ఉత్తేజపరిచారు. రంగారెడ్డి, వైజాగ్, ఖమ్మం, పాల్వంచ, శ్రీకాకుళం జట్ల మధ్య పోటీ రసవత్తరంగా కొనసాగింది. ఈ పోటీలు శుక్రవారం కూడా కొనసాగుతాయని గేమ్స్ కమిటీ నిర్వహకులు తెలిపారు. ఉత్సాహల సందర్భంగా ఎడ్లబండ లాగుడు పోటీలు, మహిళా కబడ్డీ పోటీలు వద్ద ఎలాంటి ఇబ్బంది, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్‌ఐ నరేష్ బందోబస్తును తన సిబ్బందితో పర్యవేక్షిస్తున్నారు.

198
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles