ప్రమాదవశాత్తు వాగులో పడి వ్యక్తి మృతి

Fri,March 22, 2019 01:36 AM

తల్లాడ, మార్చి 21 : గేదెలు మేపేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు వాగులో పడి పశువుల కాపరి మృతిచెందిన సంఘటన గురువారం మండల పరిధిలోని మిట్టపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... నూతనకల్‌కు చెందిన షేక్ హుస్సేన్‌సాహేబ్(55) ఉదయం పశువులు మేపేందుకు మిట్టపల్లిలోని గంగిదేవిపాడు వాగు వైపు వెళ్లాడు. పశువులు వాగు దాటి పంట పైరులోకి వెళ్తుండటంతో హుస్సేన్ వాగు దాటేందుకు వెళ్లగా వాగులో మునిగి ప్రమాదవశాత్తు మృతిచెందాడు. ఇదిలా ఉండగా రెండు సంవత్సరాల క్రితం మృతుడి పెద్దకుమార్తె మృతిచెందగా, 10నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో అతని కుమారుడు మృతిచెందాడు. దీంతో ఆ కుటుంబం దిక్కులేనిదైంది. మృతుడికి భార్య ఉంది.

209
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles