పాలేరు సంత వేలం రూ.52 లక్షలు

Wed,March 20, 2019 12:56 AM

కూసుమంచి, మార్చి 19: జిల్లాలో అతిపెద్ద వారపు సంతల్లో ఒకటైన పాలేరు సంత వేలం మంగళవారం నిర్వహించారు. వేలంలో మొత్తం 15 మంది పాల్గొనగా మండలంలోని కొత్తూరుకు చెందిన బజ్జూరి ఉపేందరెడ్డి ఈసారి రూ.52 లక్షలకు దక్కించుకున్నారు. గతేడాది కంటే ఇది రూ.2లక్షల12వేలు తక్కువ. గతేడాది రూ.54లక్షల12 వేలకు బజ్జూరి ఉపేందర్‌రెడ్డి వేలంలో హక్కు పొందాడు. అయితే వ్యాపారాలు మందగించడం, పశువుల విక్రయాలు తగ్గిపోవడంతో పాటదారులు తమకు గిట్టుబాటు కావడంలేదని వేలంలో ఎక్కువ మొత్తం పాడడానికి సాహసించలేదు. అధికారులు సర్కారీ పాటు రూ.56 లక్షలకు నిర్ణయించగా తొలుత చాలా తక్కువకు వ్యాపారులు పాడారు. దీంతో కొంత విరామం తీసుకుని పాటదారులు బయటకు వెళ్లి చర్చించుకున్నారు. అనంతరం ప్రారంభమైన వేలంలో ప్రస్తుతం సంత హక్కుదారుడైన బజ్జూరు ఉపేందర్‌రెడ్డి రూ.52 లక్షలకు దక్కించుకున్నారు. ఏప్రిల్ 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఇతనికి సంత నిర్వహణ హక్కు ఉంటుంది. అధికారులు హక్కుదారుని వద్ద డిపాజిట్ కట్టించుకుని, హక్కుపత్రాన్ని అందజేశారు. ప్రస్తుతం పశువులు, మేకలు, గొర్రెల విక్రయాలకు రూ.120 వసూలు చేస్తుండగా, ఏప్రిల్ 1 నుంచి రూ.160 వసూలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. పాలేరు సర్పంచ్ ఎడవెల్లి మంగమ్మ అధ్యక్షతన జరిగిన ఈవేలంపాటలో ఇంచార్జి ఎంపీడీఓ కూసు వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ గోపె వెంకన్న, పంచాయతీ కార్యదర్శి రామిరెడ్డి ఉపేంద్రయ్య, నేలకొండపల్లి మార్కెట్ కమిటీ డైరక్టర్ రంజాన్‌అలీ, మాజీ సర్పంచ్ బజ్జూరి వెంకటరెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు దాసరి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

248
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles