ఓటర్ల జాబితాల్లో అభ్యంతరాలుంటే తెలపాలి

Wed,March 20, 2019 12:55 AM

నేలకొండపల్లి/తిరుమలాయపాలెం, మార్చి 19: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాలో ఏమైన మార్పులు ఉంటే ఈనెల 23లోపు తెలపాలని ఎంపీడీవో రవికుమార్ తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ మండలంలో మొత్తం 91 పోలింగ్ బూత్‌లను ఉన్నాయని, అన్ని కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన పోలింగ్ కేంద్రాల్లోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతుందన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల జాబితాలను పబ్లికేషన్ చేయడం జరిగిందని, వాటి ని పరిశీలించి ఓటును చూసుకోవాలన్నారు. ఇప్పటి వరకు గత నెల 22 వరకు దరఖాస్తు చేసుకున్న వారి వరకు ఓటు హక్కు లభిస్తుందని తెలిపారు. నేలకొండపల్లి మేజర్ గ్రామ పంచాయతీలో వార్డుల వారిగా ఎంపీటీసీలను విభజించడం జరిగిందని, ఓటర్లు తమ ఓటు ఏ వార్డులో ఉందో సరి చూసుకోవాలన్నారు. సమావేశంలో ఈవోఆర్డీ ప్రభాకర్‌రావు, సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, రాజకీయ పార్టీల నాయకులు వెన్నపూసల సీతరాములు, ఆరెకట్ల గురవయ్య, గుడవర్తి నాగేశ్వరరావు, మామిడి వెంకన్న, బోందయ్య, నల్లమాసు మల్లయ్య, పగిడికత్తుల వెంకటేశ్వర్లు, రాందసు, రవి, సురేష్ పాల్గొన్నారు.

రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం
తిరుమలాయపాలెం: ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శించిన ఓటరు జాబితా ముసాయిదాపై ఏమైన అభ్యంతరాలు, సలహాలను తెలపాలని ఈవోఆర్డీ రాజేశ్వరీ తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం జరిగిన వివిధ రాజకీయ పార్టీల నాయకుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఓటరు జాబితాల అభ్యంతరాలను ఈనెల 25తేది వరకు లి ఖిత పూర్వకంగా తెలపాలని కోరారు. అభ్యంతరాలపై విచారణ జరిపి సవరణలు చేస్తామన్నారు. సమావేశంలో యూడీ సీ ఈశ్వర్, ఎల్‌డీసీ శ్రీనివాస్, వివిధ పార్టీల నాయకులు అంగిరేకుల నర్సయ్య, కొండబాల కరుణాకర్, ఎం. రాజేంద్రప్రసాద్, బెల్లం శ్రీను, బత్తుల రాధాకృష్ణ పాల్గొన్నారు.

203
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles