ప్రజలు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకోవాలి..

Wed,March 20, 2019 12:55 AM

-రూరల్ మండలంలో పలు గ్రామాల్లో ప్లాగ్‌మార్చ్ నిర్వహించిన పోలీసులు
-ఐటీబీపీ పారా మిలటరీ బలగాలతో మండలంలో కవాతు..
ఖమ్మం రూరల్, నమస్తేతెలంగాణ, మార్చి 19 : ప్రజలు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునేందుకే గ్రామాల్లో ప్లాగ్‌మార్చ్ నిర్వహిస్తున్నట్లు ట్రైనీ ఐపీఎస్ వినిత్ అన్నారు. మొదట విడత లోకసభ ఎన్నికల నేపథ్యంలో మండల ప్రజలు ఓటు హక్కు నిర్భయంగా వినియోగించుకునేందుకు మంగళవారం మండలంలోని కొండాపురం, నర్పింహపురం, మద్దులపల్లి, చింతపల్లి, తల్లంపాడు, ఆరెకోడు, కస్నాతండా, ఎం.వీపాలెం, ఆరెకోడుతండా, ఏదులాపురం, కాచిరాజుగూడెం గ్రామాల్లో ట్రైనీ ఐసీఎస్ వినిత్, రూరల్ ఏసీపీ రామోజీ రమేష్ ఆధ్వర్యంలో ఇండో టిబెటన్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(ఐటీబీపీ) పారా మిలటరీ బలగాలు, స్థానిక పోలీసులు కలిసి కవాతు నిర్వహించారు. ఈ కవాతను ట్రైనీ ఐపీఎస్ డాక్టర్ వీనిత్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు తమ ఓటును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు వీలుగా పోలీస్‌శాఖ అవగహన కల్పిస్తుందన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండాఎన్నికల పక్రీయను నిక్షపాతంగా నిర్వహించడానికి సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ స్టేషన్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అందులో భాగంగానే ఐటీబీపీ పారా మిలటరీ సిబ్బంది, స్థానిక సిబ్బంది కలిసి ప్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్లాగ్ మార్చ్‌లో రూరల్ సీఐ రమేష్, ఎస్‌ఐ వెంకట్రావ్, రఘునాథపాలెం ఎస్‌ఐ సంతోష్, పోలీసు సిబ్బంది ఉన్నారు.

208
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles