మంచినీటి సమస్య పరిష్కరించాలి : ఐటీడీఏ పీవో

Mon,March 18, 2019 11:44 PM

భద్రాచలం, నమస్తే తెలంగాణ మార్చి18: గిరిజన గ్రామాలలో తాగునీటి ఎద్దడిపై సంబంధిత ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి మంచినీటి సమస్య పరిష్కార దిశగా కృషి చేయాలని భద్రాచలం ఐటీడీఏ పీవో వీపీ గౌతమ్ అన్నారు. సోమవారం స్థానిక ఐటీడీఏ సమావేశపు హాలులో ఏర్పాటు చేసిన ప్రజావాణి గిరిజన దర్భార్‌లో యూనిట్ అధికారులతో కలిసి పీవో పాల్గొన్నారు. మారుమూల ప్రాంతాల నుంచి వివిధ సమస్యలపై దర్భార్‌కు వచ్చిన గిరిజనుల నుంచి పీవో దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ.. గిరిజనులు అందించిన దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేసి వారు అందించిన దరఖాస్తుపై రశీదు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఐటీడీఏలో భవితా సెల్ ద్వారా గ్రామీణ నిరుద్యోగ యువత వివిధ ప్రైవేట్ రంగాలలో శిక్షణతో కూడిన ఉపాధివకాశాల కోసం దరఖాస్తులు అందజేయవచ్చునని పేర్కొన్నారు. వేసవి కాలం ఉన్నందున తాగునీటి ఎద్దడిపై రోజువారి పత్రికలలో వార్తలు వస్తున్నాయని, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు గ్రామాలలో తిరిగి నీటి ఎద్దడి నివారణకు మార్గాలు అన్వేషించాలని తెలిపారు. అనంతరం ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల వివరాలు...పినపాక మండలం వీరాపురం గ్రామానికి సంత్ సేవాలాల్ మహారాజ్ ట్రైబల్ లేబర్ కాంట్రాక్ట్ పరస్పర మహిళల సహకార సంఘం రిజిస్ట్రేషన్ చేయుటకు సిఫార్స్ చేసినట్లయితే ఇసుకరీచ్ ఏర్పాటు చేసుకొని ఉపాధి పొందుతామని దరఖాస్తు సమర్పించారు. దరఖాస్తులు స్వీకరించిన పీవో వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (ఎస్‌డీసీ) బీ.వెంకటేశ్వర్లు, ఏపీవో జనరల్ నాగోరావు, ఎస్‌వో సురేష్‌బాబు, ఈఈ కోటిరెడ్డి, ఏడీఎం హెచ్‌వో సింగరాజు, ఏవో భీమ్, ఏపీవో పవర్ అనురాధ, ఏడీ అగ్రికల్చర్ సుజాత, సంబంధిత యూనిట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

195
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles