ప్రచార కార్యక్రమాలకు అనుమతులు తప్పనిసరి

Mon,March 18, 2019 11:43 PM

ఖమ్మం నమస్తేతెలంగాణ: పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని ఎన్నికల ప్రచార కార్యక్రమాల అనుమతులకు 24 గంటల ముందు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ అన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో ఎన్నికల వ్యయ పరిశీలకులు జీ మనిగందస్వామి, రామ్‌సింగ్ షెకావత్‌లతో కలిసి గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను సోమవారం విడుదల చేయడం జరిగిందని, నామినేషన్ పత్రాలను, రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ కార్యాలయం నుంచి పొందవచ్చున్నారు. ఈ నెల 21న హోలి పండుగ, 23న నాల్గవ శనివారం, 24న ఆదివారం మూడు రోజులు ప్రభుత్వ సెలవులు మినహాయించి ఈనెల 25వ తేదీవరకు ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ పత్రాలు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి స్వీకరిస్తారని కలెక్టర్ తెలిపారు. అభ్యర్థులు నామినేషన్‌తో పాటు సమర్పించే ఫొటోలతో ఎటువంటి పార్టీ చిహ్నాలు, కండువాలు, ఇతర గుర్తులు ఉండరాదని సూచించారు.

ఈ నెల 26న ఉదయం 11 గంటలకు కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో నామినేషన్ల పరిశీలన చేయబడుతుందని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల వ్యయ పరిశీలకులు రామ్‌సింగ్ షెకావత్, జీ.మునిగందస్వామి మాట్లాడుతూ.. అభ్యర్థులు తప్పనిసరిగా ప్రత్యేక బ్యాంకు ఖాతాలను ప్రారంభించాలని, నామినేషన్ తేదీ నుంచి ఎన్నికల వ్యయ లెక్కింపు ప్రకియ చేపట్టడం జరుగుతుందన్నారు. ఎన్నికల వ్యయానికి సంబంధించి మూడు సార్లు తనిఖీ చేయడం జరుగుతుందని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల వ్యయ నిర్వహణ రిజిస్టర్లను తప్పనిసరిగా క్రమ పద్దతిలో నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ప్రియాంక, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరెడ్డి, టిఆర్‌ఎస్ ప్రతినిధి ఎం.హన్మంతరెడ్డి, బీజేపీ నాయకులు జీ విద్యాసాగర్‌రావు, సీపీఐ నాయకులు తాటి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు గోపాల్‌రావు, తెలుగుదేశం నాయకులు సింహాద్రియాదవ్, బీఎస్‌పీ నాయకులు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

171
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles