పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం..

Mon,March 18, 2019 01:53 AM

ఖమ్మం వ్యవసాయం: ఆకలి అందరికి ఉంటుంది కానీ, ఆహారం కొందరికే ఉంటుంది. మంచి ఆహారం తీసుకోవటం వల్ల ఆకలి తీరడమే కాకుండా సరైన పోషణ కూడా లభిస్తుంది. గర్భిణులు, బాలింతలు, పిల్లలు, కిషోర బాలికలు, యువకులు, వృద్ధులు.. ఇలా మనిషి ప్రతీ దశలో ఆయా ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవటం చాలా ముఖ్యం. కొన్ని ఖర్చుతో కూడుకున్నవి అయితే, మరికొన్ని సహజంగా లభించే వనరులున్నాయి. కొన్నికొన్ని సందర్భాల్లో మన నిర్లక్ష్యానికి చాలా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మన ఇంటి చుట్టూ ఉండే పరిసర ప్రాంతాలు, అపరిశుభ్రత వల్ల అనేక ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. క్రమం తప్పకుండా వ్యాయమం చేయకపోవటం వల్ల అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు లేకపోలేదు. సంపూర్ణ ఆరోగ్యం కావాలంటే, సమతుల పౌష్టికాహారం ఆరోగ్య సంరక్షణ, వ్యాధుల పట్ల అవగాహన, అంటువ్యాదుల పట్ల జాగ్రత్తలు, వ్యయామం, తప్పనిసరి. ఏదీఏమైనా మంచి ఆరోగ్యం కావాలంటే తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు ఏమిటీ, ఎలాంటి పోషక పదార్థాలు తీసుకోవాలి.. తద్వారా చేకూరే ప్రయోజనాలపై నమస్తే తెలంగాణ అందిస్తున్న ప్రత్యేక కథనం..

గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
గర్భదశలో ఇనుము లోపం ఉంటే అది ఒక్కో సమయంలో తల్లి ప్రాణాలకు ప్రమాదంతో పాటు శిశువులు బరువు తక్కువగా పుట్టే ప్రమాదం ఏర్పడుతుంది. మంచి ఆరోగ్యానికి అవసరం అయ్యే మాంసం, చేపలు తీసుకోవడం ద్వారా ఇనుము ఉత్పత్తి అవుతుంది. వీటితో పాటు ఆకుకూరలు ఎక్కువుగా తీసుకోవటం చాలా మంచిది. టీ సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఉడికించిన గింజలు సోయా, చిక్కుడు, వేరుశనగా, మొలకలు గర్భిణులు తినడం చాలా ఉపయోగం. సాయంత్రం వేళల్లో వ్యాయమం తప్పనిసరి. ప్రతిరోజూ యాపిల్, దానిమ్మలతో పాటు ఒక ఉడక పెట్టిన గుడ్డు తీసుకోవాల్సిన అవసరం గర్భిణీకి చాలా అవసరం.

కౌమారదశ బాలికలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
12 నుంచి 18సంవత్సరాల వయస్సు కలిగిన వారిని కిషోర (కౌమరదశ) బాలికలు అంటాం. ఈ సమయంలో ఆడ పిల్లల బరువు, ఎదుగుదల ఎక్కువుగా ఉంటుంది. హార్మోన్స్ ప్రభావం వలన లైంగిక పరిపక్వత, బావోద్వేగ లక్షణాలు ఈ దశలో కన్పిస్తాయి. బాలుర కంటే బాలికలకు శారరీక ఒత్తిడికి ఎక్కువుగా గురవుతారు. అందుకే వీరికి పోషకాహారం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఈ దశలో ఆడ పిల్లలు పోషక పదార్థ్ధాలు తీసుకున్నైట్లెతే గర్భిణులు, బాలింతల సమయాల్లో ఆ ప్రభావం పడుతుంది. ఎదిగే వయసు దృష్ట్యా శరీరానికి కార్పోహైడ్రెట్లు, మాంసకృత్తులు, కొవ్వు పదార్థ్ధాలు, ఖనిజ లవణాలు సమానంగా తీసుకోవాలి. పెసలు, శనగలు, ఆలచందలు నానాబెట్టిన మొలకలు వచ్చిన తరువాత తీసుకున్నట్లయితే ఎంతో మేలు చేకూరే అవకాశం ఉంది. వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యం.

వృద్ధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
మనిషి ఎంతకాలం జీవించామనేది గొప్పకాదు. ఎంత ఆనందంగా, ఆరోగ్యంగా జీవించామనేది ముఖ్యమని అందరూ తెలుసుకోవాలి. బాల్యం, యవ్వనం, మధ్య వయస్సులో ఉన్నప్పుడు ఎవరి పనులు వారు హాయిగా చేసుకోగలుతారు. కానీ ఈ వయస్సులో అలాకాదు. ఇతరుల మీద ఆధారపడాల్సి వస్తుంది. కావునా, ఈ సమయంలో క్రమం తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీరికి శారీరక శ్రమ బాగా తగ్గుతుంది కాబట్టి తక్కువ క్యాలరీలు ఉన్న ఆహార పదార్థ్ధాలు తీసుకోవాలి. మాంసకృత్తులు, పప్పులు, కోడిగుడ్డులోని తెల్లసొన ఎక్కువుగా తీసుకోవటం ముఖ్యం. ఎక్కువగా ఆకు కూరలు, కూరగాయాలతోపాటు పండ్ల రసాలు తీసుకోవాలి. మొత్తగా వండిన ఆహారం తీసుకోవటం చాలా ముఖ్యం.

ఆకు కూరల వల్ల కలిగే ప్రయోజనాలు..
ఆకుకూరల్లో విటమిన్ ఎ వల్ల కంటికి సంబంధించిన వ్యాధులు, రే-చీకటి, కంటిలో తెల్లమచ్చలు, చూపు మందగించడం వంటికి రాకుండా ఉంటాయి. తోటకూర, బచ్చలకూర, గొంగూరల్లో ఐరన్ ఎక్కువుగా ఉంటుంది. రక్తం ఉబికి తోడ్పడుతుంది. కరివేపాకు, మెంతికూర, చుక్కకూర, క్యాలిఫ్ల్లవర్, క్యాబీజీల్లో కాలుష్యం ఉంటుంది. దీని వల్ల పిల్లలకు, గర్భవతులకు, తల్లులకు కాలుష్యం లోపాన్ని తగ్గించడమే కాకుండా ఎముకల బలహీనత తగ్గిస్తుంది. చింతచిగురు, తీగ బచ్చలలో విటమిన్-సీ ఎక్కువుగా ఉండటం వల్ల వ్యాధి నిరోదకశక్తి పెంచుతుంది.

కూరగాయల ఉపయోగాలు..
ఆకుపచ్చని కూరగాయల్లో చిక్కుడు, బీన్స్, దొండ, కాకర, పొట్ల తదితర వాటిల్లో విటమిన్లు ఎక్కువుగా ఉండటం చేత కంటి చూపునకు దోహద పడుతుంది. బంగాళాదుంప, చిలగడదుంప, కందదుంప, అరటిలో ఉన్న పిండి పదార్థాల వల్ల కావాల్సిన శక్తి వస్తుంది. బీర, దోస, కాకరకాయల్లో ఉండే పీచు పదార్థాల వల్ల మలబద్దకం తగ్గిస్తోంది. టమాట, ఉసిరి, నిమ్మలలో సీ-విటమిన్ ఎక్కువుగా ఉంటుంది. కూరగాయల్లో సూక్ష్మ పోషకాలు ఎక్కువుగా ఉండటం వల్ల శరీరానికి రక్షణగా ఉంటాయి.

ఆరోగ్య తెలంగాణే ధ్యేయంగా టీ సర్కార్ చర్యలు..
అభివృద్ధితో పాటు ఆరోగ్య తెలంగాణ సమాజ నిర్మాణం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలకు రూపకల్పన చేసి అమలు చేయడం జరుగతుంది. అందులో భాగంగానే ఇప్పటికే సామాన్య, మధ్యతరగతి ప్రజల ఆర్థిక పరిస్థితులను అనుగుణంగా ప్రభుత్వ వైద్యశాలలను బలోపేతం చేస్తున్నారు. దీంతో కార్పొరేట్ వైద్యం సామాన్యుడికి అందుబాటులోకి వచ్చినైట్లెంది. మాతాశిశు మరణాలను వందశాతం తగ్గించాలనే ఉద్దేశంతో ప్రతీనెల అంగన్‌వాడీ కేంద్రాల్లో స్థానిక ఏఎన్‌ఎంల సహాయంతో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం, తల్లికి సంపూర్ణ ఆరోగ్యం అందించాలనే ఉద్దేశంతో అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆరోగ్యలక్ష్మి పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో మేలైన ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను అందిస్తూనే ప్రతిరోజు గుడ్డు, 200 గ్రామల పాలను అందిస్తున్నారు. బావిభారత పౌరులుగా మారే చిన్నారుల లోప పోషణపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తుంది. పోషన్ అభియాన్ అనే పేరుతో గత సంవత్సరం మార్చి నెల నుంచి అంగన్‌వాడీ సిబ్బంది లబ్ధిదారులకు సంపూర్ణ ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. ఈనెల 8 నుంచి జిల్లావ్యాప్తంగా ఐసీడీఎస్ మరోమారు పోషన్ పక్షం పేరుతో సమాజంలోని అన్నివర్గాల వారికి సంపూర్ణ ఆరోగ్యం అందించేందుకు గాను ప్రత్యేక కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.

231
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles