రఘునాథపాలెంలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన..

Mon,March 18, 2019 01:52 AM

-ఇక్రిసాట్ శాస్త్రవేత్తలతో కూరగాయ పంటల
-క్షేత్రస్థాయి సందర్శన
రఘునాథపాలెం: ఖమ్మం కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ ఆదివారం రఘునాథపాలెం మండలంలో ఆకస్మిక పర్యటన చేపట్టారు. ఇక్రిసాట్ నుంచి వచ్చిన చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ సెల్వరాజ్, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జానాకొల్వతో కలిసి మండల పరిధి సూర్యాతండాలో పలువురు రైతులు సాగు చేస్తున్న కూరగాయ పంటల క్షేత్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా కూరగాయ మొక్కలు, సాగు వివరాలను గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. అంతేకాక సూర్యాతండాలో ప్రయోగాత్మకంగా సాగు చేసిన చిరుధాన్యాల క్షేత్రాలను సందర్శించారు. వాటిసాగు విధానాన్ని రైతుల నుంచి తెలుసుకోవడంతో పాటు పలు సూచనలను అందించారు. చిరుధాన్యాలను ప్రాసెసింగ్ చేసుకున్నట్లయితే ఎక్కువ లాభాలు వస్తాయని ఆ దిశగా రైతులందరూ ఆసక్తి కనబరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారిణి ఝాన్సీ లక్ష్మీకుమారి, ఉద్యానవన శాఖాధికారి అనసూయ, ఖమ్మం సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీనివాసరావు, మండల వ్యవసాయాధికారి ఇంటూరి భాస్కర్‌రావు, ఉద్యానవన అధికారి మీనాక్షి, ఏఈవోలు కుమార్‌రాజా, శివకృష్ణ, మండల జెడ్పీటీసీ అజ్మీరా వీరూనాయక్, రైతులు సక్రూనాయక్ తదితరులు పాల్గొన్నారు.

201
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles