శిక్షణా కేంద్రాలను సందర్శించిన

Mon,March 18, 2019 01:52 AM

-కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్
ఖమ్మం, నమస్తే తెలంగాణ: పార్లమెంటు ఎన్నికలను పురస్కరించుకుని ఎన్నికల నిర్వహణకు కేటాయించిన పోలింగ్ అధికారుల శిక్షణ తరగతులను ఆదివారం సాయంత్రం కలెక్టర్ కర్ణన్ సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు ఎస్‌ఆర్‌అండ్ బిజీఎన్‌ఆర్ కళాశాలలో, అదేవిధంగా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన సిబ్బందికి మహ్మదీయ కళాశాలలో ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులను ఆదివారం కలెక్టర్ సందర్శించారు. పోలింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన కల్గియుండాలని ఎన్నికల సంఘం మార్గదర్శకాలకనుగుణంగా ఎటువంటి లోటుపాట్లు జరగకుండా సమర్థవంతంగా నిర్వహించేందుకు శిక్షణా తరగతుల ద్వారా సమగ్ర అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ఏమైనా సందేహాలుంటే వాటిని సత్వరమే మాస్టర్ ట్రైనర్స్, సెక్టోరల్ అధికారుల ద్వారా నివృత్తి చేసుకోవాలన్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్‌ల పనితీరు, నిర్వహణ పట్ల పూర్తి అవగాహన కలిగియుండి పోలింగ్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వర్తించాలని చెప్పారు. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు జే శ్రీనివాసరావు, ఆర్ దశరథ్, మాస్టర్ ట్రైనర్స్, సెక్టోరల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

239
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles