చూచువారలకుచూడ ముచ్చటగ..

Mon,March 18, 2019 01:52 AM

-తిరునగర్‌కొండ గిరిజన బాలాజీ
-వేంకటేశ్వరస్వామి కల్యాణం
టేకులపల్లి: టేకులపల్లి మండల పరిధిలోని సంపత్‌నగర్ సమీసంలోని తిరునగర్ కొండపై కొలువుదీరిన శ్రీశ్రీశ్రీ పద్మావతి అలివేలు మంగ సహిత శ్రీ గిరిజన బాలాజీ వెంకటేశ్వరస్వామి కల్యాణం ఆదివారం కన్నుల పండువగా భక్తజన కోలాహలం నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. యాజ్ఙకులు శ్రీరంగం నరేషాచార్యులు, ఆలయ ప్రధాన అర్చకులు పరంకుశం సొమాచారి, కృష్ణమాచార్యులు స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని వేద మంత్రోచ్ఛరణల నడుమ నిర్వహించారు. ప్రభాత సమయాన స్వామివారికి సుప్రభాతసేవ, అభిషేకం చేసి సుందరంగా అలంకరించారు. మధ్యాహ్నం 12గంటలకు స్వామివారిని కల్యాణమండప ప్రవేశ వేడుకలు నిర్వహించారు. పాల్గుణమాస శుద్ధ ఏకాదశి పుష్యమి నక్షత్రయుక్త అభిజిత్ లగ్న పుష్కరాంశ ముహూర్తాన శ్రీశ్రీశ్రీ అలివేలి సహిత వేంకటేశ్వరస్వామి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.

అనంతరం స్వామివారికి పూర్ణాహుతి, మహదాశీర్వచనం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కల్యాణ మహోత్సవ వేడుకల్లో వంశపారంపర్య ధర్మకర్త వారసులు వీ.అజయ్‌కుమార్ - సునాళిని దంపతులు, మంగతాయారు - పవన్‌రావు దంపతులు పాల్గొన్నారు. అనంతరం స్వామివారి ఊరేగింపు నిర్వహించారు. తిరునగర్ వేంకటేశ్వరస్వామి కల్యాణం నిర్వహించుట వలన సకల జనుల ఇతి బాధలు హరించుటయే గాక దేశంలోని ఉపద్రవములు, కరువు కాటకాది బాధలు తొలగి పంటలు సమృద్దిగా పండుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. భక్తుల సౌకర్యార్థం ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆళ్లపల్లికి చెందిన గౌరిశెట్టి నాగభూషణం, భారతమ్మ దంపతులు అన్నదానం నిర్వహించారు. కల్యాణమహోత్సవ వేడుకకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయపాలక మండలి సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

203
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles