రుణాల పంపిణీలో డీసీసీబీ ప్రథమ స్థానం

Sun,March 17, 2019 01:03 AM

ఖమ్మం వ్యవసాయం, మార్చి 16 : 2018-19 సంవత్సరానికి గాను రాష్ట్రంలోనే ఖమ్మం డీసీసీబీ రైతులకు ఎక్కువ మొత్తంలో పంట రుణాలు ఇచ్చామని ఖమ్మం డీసీసీబీ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి వీ వసంతరావు తెలిపారు. శనివారం సాయంత్రం నగరంలోని డీసీసీబీ సమావేశమందిరంలో జిల్లా కేంద్రబ్యాంక్ 115 మహాజన సభ జరిగింది. ఈ మహాజన సభకు ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రికొత్తగూడెం, మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల పరిధిలోని ఆయా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల బాధ్యులు హాజరయ్యారు. తొలుత బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ వేణుగోపాల్ మహాజన సభకు సంబంధించి వార్షిక నివేదికను సభ్యులు ముందు ఉంచారు. అనంతరం ఆయా సొసైటీల బాధ్యులు తమ సంఘాలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వివరించారు. పావలా వడ్డీకి సంబంధించిన రాయితీలు, గేదెల రుణాలకు సంబంధించిన రాయితీలను సత్వరం సొసైటీలకు చేరవేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రతీ సాగు రైతుకు రూ. 2లక్షల వరకు రుణ పరిమితి పెంచాలని వారు సూచించారు.

అనంతరం డీసీసీబీ సీఈఓ మాట్లాడుతూ 2018-19 సంవత్సరానికి గాను పంట రుణాల కింద రూ. 725 కోట్లను రైతులకు అందించడం జరిగిందన్నారు. స్వల్పకాలిక రుణాల కింద రూ. 612 కోట్లు, దీర్ఘకాలిక రుణాలకు సంబంధించి మరో రూ.100 కోట్లు అందించడం జరిగిందన్నారు. 2017-18 సంవత్సరంతో పోల్చుకుంటే రూ. 38 కోట్ల పెరుగుదల ఉందన్నారు. వీటితో పాడి గేదెల కోసం 9,145 మందికి రుణ సదుపాయం కల్పించడం జరిగిందన్నారు. గత సంవత్సరం లోపు రుణాల పంట రుణాల బకాయిలు పడిన వారికి రుణమాఫీ వర్తించే అవకాశం ఉందన్నారు. ఖమ్మం డీసీసీబీ రూ. లక్ష లోపు రుణాలు తీసుకున్న రైతులకు సంబంధించి దాదాపు రూ. 725 కోట్ల రుణమాఫీ వర్తించే అవకాశం ఉందన్నారు. సహకార సంఘాల బలోపేతానికి డీసీసీబీ అన్ని విధాలుగా సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు. అయితే సంఘాల బాద్యులు రుణాల రికవరీలో సైతం చొరవ తీసుకున్నైట్లెతే మంచి పలితాలు ఉంటాయన్నారు.

199
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles