పరపతేతర వ్యాపారాలపై దృష్టిసారించాలి

Sun,March 17, 2019 01:02 AM

-జిల్లా సహకార అధికారి జుంకిలాల్
జిల్లా సహకార సంఘాల అధికారి జుంకిలాల్ మాట్లాడుతూ సంఘాల బాద్యులు పరపేతతర వ్యాపారాలపై ప్రత్యే దృష్టి సారించాలన్నారు. తద్వార సంఘాలు అదనపు ఆదాయం సమకూర్చుకునేందుకు గాను దోహదపడుతుందన్నారు. 2018-19 సంవత్సరంలో డీసీసీబీ పరిధిలోని 90 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు వివిధ రకాలైన పంటల కొనుగోళ్లు చేపట్టడం జరిగిందన్నారు. ధాన్యం కొనుగోళ్లపై దాదాపు రూ. 272 కోట్ల టర్నోవర్ చేయగా తద్వార రూ. 5.44 కోట్ల మేర కమీషన్ రావడం జరిగిందన్నారు. 8 సంఘాలు మొక్కజొన్నకు సంబంధించి 8 సంఘాలు రూ. 28.43 కోట్ల టర్నోవర్ చేయగా, రూ. 22 లక్షల ఆదాయాన్ని సమకూర్చుకోవడం జరిగిందన్నారు. 71 సంఘాలు ఎరువుల వ్యాపారం ద్వారా మరో రూ. 22 కోట్ల కమిషన్ రాబట్టుకోగలిగాయన్నారు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం సంఘాలు లాభాల బాటలో ఉండటం సంతోషదాయకమన్నారు.
భవిష్యత్‌లో సైతం మరిన్ని వ్యాపారాలు చేసి అటు రైతులకు మెరుగైన సేవలు అందించడంతో సంఘాలు ఆర్థికంగా బలోపేతం అయ్యే విధంగా చూడాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో నాబార్డు డీజీఎం నాగేశ్వరరావు, వ్యవసాయశాఖ సహాయ సంచాలకుడు శ్రీనివాసరెడ్డి, మార్క్‌ఫెడ్ ఉమ్మడి జిల్లా మేనేజర్ బీ వాణీ, ఉద్యానవనశాఖ అధికారి బీ బారతీ, డీజీఎలు పద్మావతి, ఉదయశ్రీ, బ్యాంక్ మాజీ ఉపాధ్యక్షుడు బాగం హేమంతరావు, సామినేని వెంకటయ్యతో పాటు ఆయా సొసైటీల అధ్యక్షులు, డీసీసీబీ ఏజీఎంలు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

211
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles