ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా

Sun,March 17, 2019 01:02 AM

మధిర, నమస్తేతెలంగాణ, మార్చి16 : ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని శ్రీలక్ష్మీపద్మావతి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ నూతన అధ్యక్షుడు గంగవరపు వీరారెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని బంజారాకాలనీలో వేంచేసి ఉన్న శ్రీలక్ష్మీపద్మావతి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమ మహోత్సవాన్ని శనివారం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడిగా గంగవరపు వీరారెడ్డి, పాలకమండలి సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. పాలకమండలి సభ్యులతో పాటు, దాతలు, భక్తుల సహకారంతో ముందుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగా వెంకటేశ్వర్లు, మల్లాది వాసు, కళ్యాణపు పుల్లారావు, కటకం నరసింహారావు, నాగిరెడ్డి, పాల్గొన్నారు.

212
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles