పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి

Sat,March 16, 2019 12:36 AM

ఖమ్మం క్రైం, మార్చి 15 : ప్రీ అండ్ ఫెయిర్ ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా పటిష్టమైన బందోబస్తు ఏరాటు చేపట్టాలని నార్త్‌జోన్ ఐజీపీ వై నాగిరెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్, సీపీ తఫ్సీర్ ఇక్బాల్, భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్‌దత్త్‌తో కలిసి ఉమ్మడి జిల్లాల పోలీస్ అధికారులతో స్పెషల్ బ్రాంచ్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఎన్నికలకు సంబంధించిన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐజీపీ మాట్లాడుతూ... పార్లమెంటు ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ఇన్సిడెంట్ ఫ్రీగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పటిష్టంగా అమలుచేయాలని సూచించారు. ముందుగానే గుర్తించిన సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు అవసరమైన భద్రత ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఇటీవల జరిగిన శాసనసభ, గ్రామపంచాయతీకి ఎన్నికల సందర్భంగా బైండోవర్ కేసులు పరిగణనలోకి తీసుకుని పార్లమెంటు ఎన్నికల్లో కూడా శాంతిభద్రతలకు భంగం కలగకుండా నేర చరిత్ర కలిగిన రౌడీషిటర్లపై ముందుగానే బైండవర్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ప్లయింగ్ స్కాడ్ బృందాలతో పాటు నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుంచి స్టాటిస్టిక్ సర్వేలెన్స్ బృందాలు తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. ఎన్నికలపై సంబంధిత అధికారులు తీసుకున్న ముందస్తు జాగ్రత్త చర్యలు గురించి, ఎంత మంది ట్రబుల్ మాంగర్స్, అనుమానితులను, బెల్ట్ షాప్ నిర్వాహకులను, పోలీస్ స్టేషన్ పరిధిలో చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ వర్క్ గురించి, ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకుగాను డివిజన్ పరిధిలో అధికారులు చేపట్టిన ముందస్తు ఎన్నికల ప్రణాళికలపై అలాగే పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎన్ని పోలింగ్ కేంద్రాలు, ఎన్ని పోలింగ్ బూతులు, పోలింగ్ స్టేషన్ల రూట్లతో పాటు పోలీస్‌స్టేషన్ల సరిహద్దుతో కలిసివున్న పోలీస్‌స్టేషన్లు మొదలైన వివరాలను ఐజీపీ క్షుణ్నంగా అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మీడియా సమావేశంలో నార్త్‌జోన్ ఐజీపీ మాట్లాడుతూ... ఖమ్మం పార్లమెంట్‌కు సంబంధించి ఏడు నియోజకవర్గాల పరిధిలో ఉన్న 1798 పోలింగ్ కేంద్రాలలో 359క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని ఆయా ప్రాంతాలలో ప్రత్యేకంగా పోలీస్ బందోబస్తు ఏర్పాట్లతో పాటు జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో మైక్రో అబ్జర్వర్లు, వీడియోగ్రఫీ, వెబ్‌కాస్టింగ్ బృందాలు నిఘా ఉంటుందని తెలిపారు. 22స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ 21 ప్లయింగ్ స్వాడ్, 33 మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ బృందాలు, బోర్డర్ చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 124 లైసెన్సు ఆయుధాలు కలిగి ఉన్నాయని, వాటిలో 88 ఆయుధాలు డిపాజిట్ చేశారని మిగిలిన ఆయుధాలు బ్యాంకు సెక్యూరిటీ సంబంధించినవన్నారు. జిల్లా కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ మాట్లాడుతూ... ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల దృష్యా చేపట్టిన ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం శుక్రవారంతో ముగియనున్న నేపథ్యంలో అన్ని పోలింగ్ బూతుల వద్ద బూత్‌స్థాయి అధికారులు ఓటరు నమోదు దరఖాస్తు (ఫారం-6) ప్రజలు అందుబాటులో ఉంచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ డాక్టర్ వినీత్, భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్‌దత్, ఏసీపీలు సత్యనారాయణ, ఘంటా వెంకట్రావు, రామోజీ రమేష్, ప్రసన్నకుమార్, అంజనేయులు, రహ్మాన్, రామానుజం, కొత్తగూడెం, భద్రాచలం డీఎస్పీలు ఎస్‌ఎం అలీ, మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు.

281
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles