ఎంపీ స్థానం ప్రతిష్టాత్మకం

Sat,March 16, 2019 12:35 AM

ఖమ్మం, మార్చి 15 (నమస్తే తెలంగాణ): పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిని అఖండ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. అందుకు ప్రతి కార్యకర్త సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. రోటరీనగర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో కేఎంసీ కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు, అనుబంధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, ముఖ్య నాయకులతో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నందున ప్రతి ఒక్కరి పనితీరుకూ కోలమానం ఉంటుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా కార్పొరేటర్లు పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. ఎలాంటి తప్పిదాలు జరిగినా వారే బాధ్యత వహించాలన్నారు. ప్రచారంలో భాగంగా తాను ప్రతి బూత్ స్థాయిలోనూ పర్యటిస్తానని వివరించారు. ఆయా డివిజన్‌లలోని బూత్‌లలో ఎక్కడ పొరపాట్లు జరిగినా వారిపై చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. ఇది మన పార్టీ గౌరవానికి సంబంధించిన ఎన్నికలుగా భావించాలని సూచించారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా మనం కలిసి కట్టుగా, సమస్టి కృషితో ఖమ్మం పార్లీమెంట్‌ను గెలిపించుకోవాలని స్పష్టం చేశారను. ఖమ్మం పార్లమెంటు స్థానానికి అధికంగా ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మెజార్టీ సాధించేందుకు ప్రతి ఒక్కరూ తమ ప్లాన్ ఆఫ్ యాక్షన్‌ను రూపొందించుకోవాలని సూచించారు.

ఈ ఎన్నికలను గత ఎన్నికల కంటే ఎంతో ప్రతిష్టాత్మికంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. డివిజన్‌ల వారీగా, బూత్‌ల వారీగా, పోలింగ్ స్టేషన్‌ల వారీగా విడివిడిగా సమావేశాలు ఏర్పాటు చేసుకొని లోటుపాట్లు సరిచేసుకుంటూ పోవాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు కలిగినా తమ దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల కంటే రెండు రెట్లు ఖమ్మం నియోజకవర్గం నుంచి ఓట్లు సాధించే విధంగా కార్యాచరణ చేయాలని సూచించారు. అందుకే బాధ్యతాయుతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. మీరు చేస్తున్న ప్రచారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు సూక్ష్మ పర్యవేక్షణ చేస్తుంటారని వివరించారు. ఖమ్మం నుంచి మనం కేసీఆర్‌కు ఇచ్చే బహుమతి ఖమ్మం పార్లమెంట్ స్థానంలో విజయమేనని అన్నారు. మేయర్ పాపాలాల్, డిప్యూటీ మేయర్ బత్తుల మురళీ, ఆర్‌జేసీ కృష్ణ, పట్టణ అధ్యక్షుడు కమర్తపు మురళీ, ఫ్లోర్ లీడర్ కర్నాటి కృష్ణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖమర్, తవిడిశెట్టి రామారావు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు, అనుబంధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, ముఖ్యనాయకులు పాల్గొన్నారు.

271
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles