టెన్త్ పరీక్షల రోజుల్లో ఏ రూట్లో అయినా బస్‌పాస్ చెల్లుబాటు

Sat,March 16, 2019 12:35 AM

ఖమ్మం కమాన్‌బజార్, మార్చి 15: జిల్లాలో పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఆర్టీసీ బస్సు సేవలను వినియోగించుకుని పరీక్షలకు హాజరుకావాలని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కృష్ణమూర్తి సూచించారు. జిల్లా కేంద్రంలోని తన చాంబర్‌లో బస్సు రూట్ల షెడ్యూల్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బస్‌భవన్ ఆదేశాల మేరకు ఖమ్మం రీజియన్‌లో ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచి విద్యార్థులు అందులో ప్రయాణించే విధంగా కృషి చేస్తున్నామన్నారు. విద్యార్థులు బస్సు పాసులు ఒకే రూట్‌లో ఉంటాయన్నారు. అయితే పరీక్షా కేంద్రాలు మాత్రం మరో రూట్‌లో ఉండే అవకాశం ఉన్నందున ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఏ రూట్‌లో బస్సు పాసులు ఉన్నా దానితోపాటు హాల్‌టిక్కెట్లను కండక్టర్లకు చూపించి ప్రయాణించవచ్చని సూచించారు. గ్రామాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం బస్సులను త్వరగా జిల్లా కేంద్రానికి వచ్చే విధంగా డ్రైవర్లకు, సిబ్బందికి ఆదేశాలు ఇచ్చామన్నారు. బస్టాండ్లలో తమ సిబ్బంది అందుబాటులో ఉంటారని, విద్యార్థులు సందేహాలు ఉంటే సిబ్బంది సహాయం తీసుకోవాలని సూచించారు. సమయానికి పరీక్ష కేంద్రాలకు హాజరయ్యే విధంగా ఆర్టీసీ బస్సుల షెడ్యూల్‌ను విడుదల చేసినట్లు చెప్పారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఖమ్మం, మధిర, సత్తుపల్లి డిపోల పరిధిలో ఉన్న మండలాలు, గ్రామాల్లో బస్సులు ప్రతి రోజూ తిరిగే సమయాలకంటే ముందుగానే వస్తాయన్నారు. రెగ్యులర్‌గా తిరిగే సర్వీసులు కాకుండా అదనపు సర్వీసులను కూడా నడుపుతున్నామన్నారు. ఆర్టీసీ సేవలు వినియోగించుకొని పరీక్షలకు సమయానికి హాజరై పరీక్షలు రాయాలని సూచించారు.

205
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles