నిబంధనల ప్రకారం..ఎన్నికల కోడ్పాటించాలి

Fri,March 15, 2019 01:10 AM

-ప్రస్తుతం నడుస్తున్న పథకాలు, పనులను కొనసాగించాలి
-వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషి
(ఖమ్మం, నమస్తే తెలంగాణ) :ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌కే జోషి.. జిల్లా కలెక్టర్లను ఆదేవించారు. జిల్లా కలెక్టర్లతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను పాటిస్తూ ప్రస్తుతం నడుస్తున్న పథకాలు, పనులను కొనసాగించాలని సూచించారు. ఎన్నికల కోడ్ అమలుపై కలెక్టర్లు తీసుకుంటున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. సాలీడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, హరితహారం, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌ల శిక్షణ, రెవెన్యూ, అటవీ భూముల సర్వే, సీజనల్ కండీషన్స్‌పై కలెక్టర్లతో చర్చించారు. సాలీడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌పై పట్టణ ప్రాంతాలతోపాటు గ్రామీణ ప్రాంతాలపై దృష్టి సారించాలని సీఎస్ జోషి సూచించారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌ల శిక్షణా కార్యక్రమాలను ఇంకా పూర్తి చేయని వారు ఈ నెల 29లోగా పూర్తి చేయాలని కలెక్టర్లకు ఆదేశించారు. వేసవి దృష్ట్యా జిల్లాల్లో ఎక్కడా తాగునీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా సమ్మర్ యాక్షన్ ప్లాన్‌కు పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. వైద్య ఆరోగ్య, రెవెన్యూ, మున్పిపల్, పంచాయతీరాజ్, కార్మిక తదితర శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజలు ఎండలబారిన పడకుండా, మంచినీటి సమస్య ఏర్పడకుండా ముందస్తు చర్యల తీసుకోవాలని ఆదేశించారు. సాలీడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కమిటీ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ జస్టిస్ సీవీ రాములు మాట్లాడుతూ కలెక్టర్లు సాలీడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నియమాలపై సంబంధిత అధికారులకు అవగాహన కల్పించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. దీని యాక్షన్ ప్లాన్‌ను సమర్పించాలని సూచించారు.

మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ మాట్లాడుతూ సాలీడ్ వేస్ట్‌ను డిస్పోజ్ చేసే అంశంపై ప్రత్యేక దృష్టి సారించలన్నారు. అవగాహన కలిగిన ఏజెన్సీలు, నిపుణులు బృందాలను జిల్లాలకు పంపడం జరుగుతుందని, ప్రత్యేక కాలపరిమితి విధించుకోని సైంటిఫిక్ క్యాపింగ్, బయో ప్రాసెసింగ్‌కు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలలో చెత్త సేకరణ, డంపింగ్ యార్ట్‌లపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సమర్థవంతంగా అమలు పర్చండంలో భాగంగా వివిధ నిఘా బృందాలను ఏర్పాటు చేశామని వివరించారు. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా సమగ్ర ప్రణాళికతో ముందస్తు చర్యలు తీసుకున్నట్లు చెప్పారను. జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు ముందస్తు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. సబ్ కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా పరిషత్ సీఈఓ ప్రియాంక, అసిస్టెంట్ కలెక్టర్ హన్మంతు కొడింబా, నగర పాలక సంస్థ కమిషనర్ జే.శ్రీనివాసరావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అదికారి బీ.ఇందుమతి, అటవీ శాఖ అధికారి సతీష్‌కుమార్, సంబంధిత శాఖల అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

257
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles