కొనసాగుతున్న పోలీస్ ఎంపిక ప్రక్రియ

Fri,March 15, 2019 01:09 AM

-ఇద్దరు అభ్యర్థులపై అనర్హత వేటు
-సీపీ తఫ్సీర్ ఇక్బాల్
ఖమ్మం క్రైం, మార్చి 14 : ఉద్దేశపూర్వకంగా 800 మీటర్ల పరుగుపందెంలో లైన్‌క్రాస్ చేసి లోపలి నుంచి పరుగెత్తిన ఇద్దరు అభ్యర్థులను డిస్‌క్వాలిఫై(అనర్హత) చేసినట్లు పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. పోలీస్ ఉద్యోగ ఎంపిక ప్రక్రియలో భాగంగా గురువారం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో కొనసాగుతున్న కానిస్టేబుల్, ఎస్‌ఐ అభ్యర్థుల శారీరక సామర్థ్య పరీక్షలో భాగంగా నిర్వహిస్తున్న 800మీటర్ల పరుగులో 2వ రౌండ్‌లో లాప్ మొత్తం పూర్తిచేయకుండా మధ్య భాగం నుంచి ఫీనిషింగ్ పాయింట్‌కు పరుగెత్తి తక్కువ సమయంలో పరుగు పూర్తి చేసినట్లు సీసీ కెమెరాలలో స్పష్టంగా రికార్డు అయి కనిపించడంతో ఆయా అభ్యర్థుల అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. ప్రతి ఈవెంట్ వద్ద పేరడ్ మైదానాన్ని కవర్ చేసే విధంగా 13 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పోలీసు ఉద్యోగాల దేహదారుఢ్య పరీక్షలో ఎక్కడ లోపాలు లేకుండా పకడ్బందీగా చేస్తున్నామన్నారు. ప్రతి అభ్యర్థి చేస్తున్న ఈవెంట్‌లో తన పార్ఫార్మెన్స్ సీసీ టీవీలలో రికార్డు అవుతుందని అభ్యర్థులు తమ స్వశక్తిని మాత్రమే నమ్ముకుని ఈవెంట్‌లలో పాల్గొనాలని సీపీ సూచించారు.

26వ రోజు 880మంది అభ్యర్థులు హాజరు
పోలీస్ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో 26వ రోజు శారీరక సామర్థ్య పరీక్షలకు 1000మంది అభ్యర్థులకుగాను 880మంది అభ్యర్థులు హాజరయ్యారని, 120 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారని సీపీ పేర్కొన్నారు. ఎత్తు, ఛాతి కొలతలలో అర్హత పొందిన వారందరికి ముందుగా 800మీటర్ల పరుగుపందెం నిర్వహించారు. అందులో అర్హతపొందిన అభ్యర్థులకు తదుపరి లాంగ్‌జంప్, షార్ట్‌పుట్, హైజంప్, 100మీటర్ల పరుగుపందెం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ డీసీపీ శ్యామ్‌సుందర్, ఏసీపీలు సత్యనారాయణ, రామోజీ రమేష్, రెహ్మాన్, రామానుజం, విజయబాబు, రియాజ్, కుమారస్వామి, సీపీఏఓ జానకిరామ్, భాస్కర్‌రెడ్డి, రెహ్మతుల్లాఖాన్, ఆర్‌ఐలు శ్రీనివాస్, మదన్‌మోహన్, నాగేశ్వరరావు, రవి, ఎస్‌బీ సీఐ సంపత్‌కుమార్, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.

216
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles