రేపటి పది పరీక్షకు ఏర్పాట్లు పూర్తి..

Fri,March 15, 2019 01:09 AM

-కలెక్టర్‌కు నివేదించిన జిల్లా అబ్జర్వర్, డీఈఓ
-నేడు ప్లయింగ్ స్కాడ్స్, కస్టోడియన్స్‌తో సమావేశం
ఖమ్మం ఎడ్యుకేషన్, మార్చి 14 : పదవ తరగతి పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయని, నిబంధనల మేరకు కేంద్రాలను సిద్ధం చేసినట్లు కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్‌కు జిల్లా అబ్జర్వర్, విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసచారి, డీఈఓ మదన్‌మోహన్‌లు నివేదించారు. గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్ కర్ణన్‌తో సమావేశమయ్యారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన రెగ్యులర్ 89 కేంద్రాలు, ప్రైవేట్ కేంద్రాలు 5 సిద్ధం చేసినట్లు, పరీక్షలు ప్రశాంతంగా పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రతి కేంద్రానికి సిట్టింగ్ స్కాడ్‌లను నియమించి ఆర్డర్లు ఇచ్చినట్లు వివరించారు. పరీక్షల నిర్వహణలో కీలకమైన కస్టోడియన్‌లకు అవసరమైన సూచనలు చేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా పలుఅంశాలపై కలెక్టర్ సూచనలు చేశారు. కిందిస్థాయి సిబ్బంది నుంచి అధికారి వరకు అప్రమత్తంగా ఉండాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగవద్దని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఏ చిన్న విషయమైనా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని, తద్వారా పరిష్కారం తెలుస్తుందని వివరించారు.

డీఈఓతో చర్చించిన అబ్జర్వర్...
కలెక్టర్‌ని కలిసిన అనంతరం డీఈఓ కార్యాలయంలో డీఈఓ, పరీక్షల విభాగం సిబ్బందితో కలిసి పరీక్షల నిర్వహణపై చర్చించారు. పరీక్షల్లో కీలకంగా ఏ ఒక్కరు మొబైల్ ఫోన్ వాడకుండా చర్యలు తీసుకోవాలని, ఫోన్ వాడితే శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. పరీక్ష ప్రారంభం సమయానికి కంటే ముందుగా కేంద్రాలకు రావాలని, ఆలస్యంగా వచ్చే విద్యార్థులపై దృష్టి సారించాలని అందుకు ఎంఈఓలకు, చీఫ్ సూపరిండెంట్‌లకు స్పష్టమైన సూచనలు చేయాలని డీఈఓకి స్పష్టంచేశారు. పరీక్ష కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ ఉంటుందని, పరీక్షకేంద్రం సమీపప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్ల మూసివేతకు చర్యలు తీసుకోవాలన్నారు. గత సంవత్సరం ఎర్రుపాలెం మండలం, చింతకాని మండలంలోని కొన్ని పాఠశాలలకు విద్యార్థులకు ఆలస్యంగా వస్తున్న అంశాలు చర్చకు రాగా వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని సిట్టింగ్ స్కాడ్‌లకు సూచనలు చేయాలని డీఈఓకు వివరించారు. హాల్‌టిక్కెట్ లేని విద్యార్థులు WWW.BSE.TELANGANA.GOV.IN వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు.

టెలీ కాన్ఫరెన్స్‌కు ఏర్పాట్లు...
పది పరీక్షలకు ప్రధానంగా టెలీ కాన్ఫరెన్స్‌ను నిర్వహిస్తారు. విద్యాశాఖకు చెందిన ఉన్నతాధికారులు ఏ ప్రశ్నాపత్రం తీసుకెళ్ళాలి అనే దానిపై సమాచారం ఇస్తారు. జిల్లాల్లో ప్రశ్నాపత్రాలను పోలీస్‌స్టేషన్లలో భద్రపరుస్తారు. ఆయా పోలీస్ స్టేషన్లలలో ఉన్న టెలీ కాన్ఫరెన్స్‌లో కస్టోడియన్స్, సీఎస్‌లకు సమాచారం ఇచ్చేందుకు, మాట్లాడేందుకు జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో టెలి కాన్ఫరెన్స్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక యాంటినా, మౌత్ ఫీస్, ఫ్రీక్వెన్సిని పరిగణలోకి తీసుకుని అనుసంధానం చేసే ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం డీఈఓ కార్యాలయంలో ప్లయింగ్ స్కాడ్స్, కస్టోడియన్స్‌తో జిల్లా అబ్జర్వర్ శ్రీనివాసచారి సమావేశం నిర్వహించనున్నారు.

247
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles