ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు..

Thu,March 14, 2019 12:22 AM

ఖమ్మం, నమస్తే తెలంగాణ: ఎన్నికల సంఘం మార్గదర్శకాలకనుగుణంగా పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల భద్రతా ఏర్పాట్లపై బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్లు, పోలిసు కమిషనర్లు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ.. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ముందస్తుగానే గుర్తించి అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. జిల్లా ఎలక్షన్ మేనేజ్‌మెంట్ ప్లాన్‌తో పాటు జిల్లా సెక్యూరిటీ ప్లాన్ ప్రకారం రూపొందించిన వల్లరబిలిటీ మ్యాపింగ్ ననుసరించి సమస్యాత్మక, సున్నిత, అతి సున్నిత ప్రాంతాలలో శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైన మేరకు అదనపు బలగాలను ఏర్పాటు చేయాలని ఆయన పోలిసు అధికారులకు సూచించారు. శాసనసభ ఎన్నికల సందర్భంగా చేపట్టిన బైండోవర్ కేసులను పరిగణలోకి తీసుకుని పార్లమెంట్ ఎన్నికల్లో కూడా శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా నేరచరిత్ర కలిగిన వారిపై, రౌడీ షీటర్లపై ముందస్తుగానే బైండోవర్ కేసులను నమోదు చేయాలన్నారు. అక్రమ నగదు, మద్యం రవాణాను అరికట్టేందుకు జిల్లా రాష్ట్ర సరిహద్దు పాంతాలలో ప్రత్యేక తణిఖీలు చేపట్టాల చెప్పారు. ఈవీఎంల మొదటి విడత పరిశీలన, మాక్‌పోల్, జిల్లాలకు అవసరమైన బ్యాలెట్, కంట్రోల్ యూనిట్‌లు, ఎన్నికల అధికారులు, సిబ్బంది శిక్షణా తరగతుల నిర్వహణ తదితర అంశాలపై తగు సూచనలు చేశారు. కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్, పోలీసు కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్, శిక్షణా ఐపీఎస్ అధికారి వినీత్, సబ్ కలెక్టర్ అనురాగ్ జయంతి, అడిషనల్ పోలిసు కమిషనర్ మురళీధర్‌రావు, నోడల్ అధికారులు సత్యనారాయణ, శ్రీరామ్, మదన్‌గోపాల్ తదితరులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

220
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles