ముగిసిన ఇంటర్ పరీక్షలు..

Thu,March 14, 2019 12:21 AM

ఖమ్మం ఎడ్యుకేషన్: విద్యార్థి దశలో కీలకమైన ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు బుధవారంతో ముగిశాయి. ఫిబ్రవరి 27వ తేదీన ప్రారంభమైన పరీక్షలు బుధవారం జరిగిన రసాయనశాస్త్రం-2బీ, పరీక్షతో ద్వితీయ సంవత్సర విద్యార్థులకు పరీక్షలకు ముగిశాయి. సంవత్సరం పాటు పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు పరీక్ష రాసిన అనంతరం రెక్కలు వచ్చిన పక్షుల్లా కేరింతలతో సందడి చేశారు. చివరి పరీక్ష రాసి కేంద్రాల్లో నుంచి బయటికి వచ్చి ఆకాశాన్ని జయించినంత ఆనందంగా ఒకరికొకరు ఆలింగనం చేసుకున్నారు. తల్లిదండ్రులకు దూరంగా హాస్టల్‌లో, రూముల్లో ఉండి చదువుకుని పరీక్షలు ముగియడంతో ఇంటిబాట పట్టారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో మొత్తంగా ఒకరు, ప్రథమ సంవత్సర పరీక్షల్లో ఇద్దరు విద్యార్థులు, మొత్తం ఇంటర్‌లో ముగ్గురు డిబార్ అయినట్లు డీఐఈఓ రవిబాబు తెలిపారు. బుధవారం జరిగిన పరీక్షల్లో 15,115 మందికి 714 మంది గైర్హాజరై 14,401 మంది హజరైనట్లు పేర్కొన్నారు.

226
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles