ఏప్రిల్ 6న నవోదయ ప్రవేశ పరీక్ష..

Thu,March 14, 2019 12:21 AM

- దరఖాస్తు చేసుకున్న 4,940 మంది విద్యార్థులు
కూసుమంచి: పాలేరు నవోదయ విద్యాలయంలో 2019-20 విద్యా సంవత్సరంలో 6వ తరగతిలో ప్రవేశానికి ఏప్రిల్ 6న నిర్వహించే పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల హాల్ టికెట్లు వెబ్‌సైట్‌లో ఉంచినట్లు విద్యాలయం ప్రిన్సిపాల్ పాటి సురేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు. అలాగే తమ విద్యాలయంలో దరఖాస్తులు అందజేసిన విద్యార్థులు విద్యాలయంలోనే పనివేళల్లో పొందవచ్చని తెలిపారు. దీనిపై ఎలాంటి సందేహాలు ఉన్నా విద్యాలయం సిబ్బందిని సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఈ పరీక్ష కోసం ఖమ్మం జిల్లాలో 2,807 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 14 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,873 మంది విద్యార్థులకు 11 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం నుంచి 260 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారని, మొత్తం తమ విద్యాలయం పరిధిలో4,940 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్షకు హాజరవుతున్నారని ప్రిన్సిపాల్ వివరించారు.

282
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles