అన్ని వసతులు కల్పించండి..

Wed,March 13, 2019 12:20 AM

అశ్వారావుపేట, నమస్తే తెలంగాణ : త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల నిర్వాహణకు సంబంధించి అన్ని వసతులకు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ స్థానిక అధికారులను ఆదేశించారు. ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రంలో అధికారులకు అవసరమైన వసతులు కల్పించాలని సూచించారు. స్థానిక వ్యవసాయ కళాశాలను మంగళవారం ఆయన సీపీ తఫ్సీర్ ఇక్బాల్‌తో కలిసి సందర్శించారు. పార్లమెంట్ ఎన్నికల కోసం అశ్వారావుపేట నియోజకవర్గంలో పోలింగ్‌కు హాజరయ్యే అధికారులకు ఎన్నికల సామగ్రి పంపిణీకి వ్యవసాయ కళాశాలను ఎంపిక చేశారు. అనతరం స్ట్రాంగ్ రూంతో పాటు కమిషనింగ్ రూం, ఎన్నికల సిబ్బందికి శిక్షణ గదులను పరిశీలించారు. ఎంపిక చేసిన గదుల్లోని కళాశాల సామగ్రిని ఖాళీ చేయించాలని అసోషియేట్ డీన్ డాక్టర్ సీ నరేంద్రరెడ్డికి సూచించారు. ఎన్నికల ఏర్పాట్లను వేగవంతం చేయాలని చెప్పారు. వారి వెంట ఖమ్మం స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ సత్యనారాయణ, దమ్మపేట ఎస్సై ప్రవీణ్, గిర్దావర్ అనిల్ కుమార్, సర్వేయర్ ధర్మారావు, బీవీ రామారావు, ఇతర రెవెన్యూ అధికారులు ఉన్నారు.

253
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles