ముగిసిన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు

Wed,March 13, 2019 12:20 AM

- నేటితో ద్వితీయ సంవత్సరం ముగింపు
- పరీక్ష కేంద్రాల వద్ద కేరింతలు కొట్టిన విద్యార్థులు
ఖమ్మం ఎడ్యుకేషన్,మార్చి12: ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు ముగిశాయి. ఫిబ్రవరి 27వ తేదీన ప్రారంభమైన ఇంటర్ పరీక్షల్లో భాగంగా మంగళవారంతో ఇంటర్ మొదటి సంవత్సర విద్యార్థులకు జరిగిన రసాయనశాస్త్రం పరీక్షతో పరీక్షలు ముగిశాయి. బుధవారం ద్వితీయ సంవత్సర విద్యార్థులకు రసాయనశాస్త్రం పరీక్షతో పరీక్షలు ముగియనున్నాయి. ఇప్పటి వరకు పుస్తకాలతో కుస్తి పట్టిన విద్యార్థులు పరీక్షలు ముగిసిన ఆనందంతో నగర వీధుల్లో, పరీక్ష కేంద్రాల వద్ద కేరింతలతో సందడి చేశారు. ఇళ్లకు దూరంగా హాస్టళ్లల్లో ఉంటూ చదివిన విద్యార్థులు పరీక్షలు ముగియడంతో ఇంటిబాట పట్టారు. విద్యార్థులను తీసుకువెళ్ళేందుకు తల్లిదండ్రులు హాస్టల్స్‌కు చేరుకుని స్వగృహాలకు తీసుకువెళ్లారు. పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నట్లు జిల్లా ఇంటర్ అధికారి రవిబాబు తెలిపారు. మొదటి సంవత్సరం పరీక్షల్లో ఇద్దరు విద్యార్థులు మాత్రమే డిబార్ అయ్యారని తెలిపారు. మంగళవారం జరిగిన పరీక్షల్లో 16,398 మందికి 15,440 మంది విద్యార్థులు హాజరై 958 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.

215
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles