ప్యాసింజర్ ఆటోను ఢీకొట్టిన కారు

Wed,March 13, 2019 12:20 AM

సుజాతనగర్, మార్చి 12 : అతివేగంగా వచ్చిన కారు ప్యాసింజర్ ఆటోను ఢీ కొట్టిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండల పరిధిలోని వేపలగడ్డ గ్రామ సమీపంలోని గాయత్రీ నగర్ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ఇరువురు వ్యక్తులు మృతి చెందగా... మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... సుజాతనగర్ మండలం సింగభూపాలెం గ్రామానికి చెందిన ఇల్లంగి లాజరు(48), కోడిరెక్కల రాజు(30), కల్లోజి సామేలు, కల్లోజి బాబు అని నలుగురు వ్యక్తులు కొత్తగూడెం రైతుబజార్ నుండి ఆటోలో సింగభూపాలెం గ్రామానికి వస్తున్నారు. ఆటోను కల్లోజి సామేల్ నడుపుతుండగా డ్రైవర్‌కి ఇరువైపులా లాజరు, రాజు అనే వ్యక్తులు కూర్చున్నారు. ఆటో వెనుక సీట్లొ అదే గ్రామానికి చెందిన బాబు కూర్చున్నాడు. ఈక్రమంలో కొత్తగూడెం నుండి గాయత్రీనగర్ గ్రామం వద్దకు వస్తున్న ఆటోను ఖమ్మం నుండి కొత్తగూడెం వైపునకు వస్తున్న కారు మూలమలుపు వద్ద లారీని ఓవర్‌టేక్ చేయబోతూ అదుపు తప్పి అతివేగంగా ఆటోను ఢీ కొట్టింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎస్సై వరుణ్‌ప్రసాద్ హుటాహుటిన సంఘటనా స్దలానికి చేరుకుని, క్షతగాత్రులను కొత్తగూడెం ఏరియా వైద్యశాలకు తరలించారు.

ఈ ప్రమాదంలో లాజరు, రాజులు అను ఇరువురు మృతిచెందగా, ఆటోడ్రైవర్ సామేలుకు రెండు కాళ్ళు విరిగాయి, కాగా సామేలుకు స్వంత తమ్ముడైన బాబుకు పక్కటెముక విరిగింది. గాయాలపాలైన వీరిద్దరిని ప్రభుత్వాసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. మృతుల్లో ఇల్లంగి లాజరు రైతు కాగా, రాజు వెల్డింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. లాజరుకు ఒక కుమారుడు, ఒక కుమార్తె, భార్య మనోహర ఉన్నారు.రాజుకు ఇంకా వివాహం కాలేదు. వీరంతా సమీప బంధువులుకావడం విశేషం. తమ వారు రోడ్డుప్రమాదంలో మృతి చెందారన్న విషయాన్ని తెలుసుకున్న కుటుంబసభ్యులు, సమీప బంధువులు ఏరియా వైద్యశాలకు చేరుకుని గుండెలవిసేలా రోధించారు. ఈ సంఘటనతో సింగభూపాలెం గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ప్రమాదానికి కారణమైన కారు యజమాని అనుమోలు భాస్కర్‌రావుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

235
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles