నేటి చదువుల్లో గురుకులాలే మేటి..

Wed,March 13, 2019 12:20 AM

పెనుబల్లి : విద్యార్థులు పూర్తిస్థాయి విద్యప్రమాణాలతో, అత్యుత్తమంగా ఎదిగేందుకు గురుకుల పాఠశాలలు బాటలు వేస్తున్నాయి. ఆ పాఠశాలలో గతంలో చదివిన విద్యార్థులు ఎంతోమంది ఉన్నత శిఖరాలకు ఎదిగారనేది జగమెరిగిన సత్యం. తరతరాల బానిసత్వం అంతం కావాలంటే, పేద కుటుంబాల్లో వెలుగులు నిండాలంటే, పేదిరకం నుండి బయటపడి ఆర్థికంగా, సామాజికంగా మెరుగుపడాలంటే గురుకుల పాఠశాలలే మార్గమనేది స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కాలంలో ఐపీఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్ కార్యదర్శిగా గురుకులాలను ముందుకు తీసుకెళ్ళడం అనేక మంచి ఫలితాలను రాబడుతోంది. గురుకులాల్లో సీట్లు పొందాలన్నా, గురుకులాల్లో చదవాలన్నా ప్రస్తుతం విద్యార్థులు తల్లిదండ్రులు అదృష్టంలా భావిస్తూ గురుకులాల ప్రవేశం కోసం దరఖాస్తులు అనే ప్రకటన వెలువడిన తరువాయి నుండి దరఖాస్తు చేసుకునేందుకు ఉత్సాహం చూపడం ఈ పాఠశాలల పనితీరుకు ఉదాహరణ.

తమ పిల్లలు సెలబ్రిటీగా ఉండాలంటే గురుకులాలు ఒక్కటే మార్గమని అందులో చేర్పించేందుకు పోటీపడటమే గురుకులాల ప్రత్యేకతకు నిదర్శనం. సమర్ధులైన, సుదీర్ఘ అనుభవం గల ఉపాధ్యాయుల బోధ, 24గంటల ఉపాధ్యాయుల పర్యవేక్షణ, ఎంసెట్, నీట్ ప్రవేశపరీక్షలకు ప్రత్యేక శిక్షణ, ప్రత్యేక క్రీడలు, పరీక్షా ఫలితాల్లో అత్యధిక శాతం ఉత్తీర్ణత, సన్నబియ్యంతో పోషకాలు కలిగిన ఆహారం అందిస్తుండటం, పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు ఉచితంగా అందించడం, మూడు జతల స్కూల్ యూనిఫాంలు, నెలకు నాలుగు పర్యాయాలు చికెన్, రెండు పర్యాయాలు మటన్‌తో భోజనంతోపాటు కాస్మొటిక్స్ వంటివి అందించడంతో ఇక్కడైతేనే తమ పిల్లలకు పూర్తిస్థాయి రక్షణ, నాణ్యమైన విద్య అందుతుందని తమ పిల్లలను గురుకులాల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇలా తెలంగాణ ప్రభుత్వం విద్యాభివృద్ధిపై దృష్టి సారించి పేద, బడుగు, బలహీనవర్గాల వారికి అండగా ఉంటుందనడానికి ఈ పాఠశాలలే నిదర్శనం. మండలంలోని అడవిమల్లేల గురుకుల పాఠశాలలో ఉన్న పరిస్థితులు యావత్తూ జిల్లాలోనే బైట ప్రాంత విద్యార్థులు కూడా ఈ పాఠశాలల్లో చదవడానికి ఆసక్తి కనబర్చడం విశేషం.

233
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles