టీఆర్‌ఎస్‌లోకి సాహితీ విద్యావేత్త..

Wed,March 13, 2019 12:19 AM

ఇల్లెందు నమస్తే తెలంగాణ, మార్చి 12 : ఇల్లెందు సాహితీ, మార్గదర్శిని విద్యాసంస్థల అధినేత దమ్మలపాటి వెంకటేశ్వరరావు(డీవీ) టీఆర్‌ఎస్‌లోకి రానున్నారు. ఇల్లెందు ప్రాంతానికి సుపరిచితుడు, విద్యావేత్త అయిన డీవీ గులాబీ తీర్ధం పుచ్చుకోనున్నారు. కేసీఆర్ వాగ్దాటి, పరిపాలిస్తున్న తీరు, సంక్షేమ పథకాల అమలు డీవీని కట్టి పడేశాయి. టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఆయన తహతహలాడుతున్నాడు. మిత్రుల సూచనల మేరకు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సమాయత్తమయ్యారు. ఇటీవల హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. టీఆర్‌ఎస్‌లోకి చేరుతున్నట్లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సీఎం స్వాగతించారు. సీఎం ఆశీర్వాదం తీసుకున్న డీవీ త్వరలోనే రాజకీయ రంగప్రవేశం చేయనున్నారు.

ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నా...
ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రముఖ విద్యావేత్త దమ్మలపాటి వెంకటేశ్వరరావు(డీవీ) ప్రకటించారు. మంగళవారం సాయంత్రం ఆయన నివాసంలో విలేకర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వివరించారు. కేసీఆర్ రాష్ట్ర ప్రగతి కోసం నిరంతరంగా శ్రమిస్తున్నారని తెలిపారు. బంగారు తెలంగాణ కోసం బాటలు వేస్తున్నారని అందుకే ఆయన వెంట నడవాలనుకుంటున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌ను హైదరాబాద్‌లో కలిశానని, ఆయన ఆశీర్వాదాన్ని తీసుకున్నానని వివరించారు. కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు బాగున్నాయని, ప్రజలంతా ఆయన వెంట నడుస్తున్నారన్నారు. అందుకే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు తెలిపారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంలో మహబూబాబాద్, ఖమ్మం, కొత్తగూడెం బహిరంగ సభ వేదికల్లో సీఎం సమక్షంలో గులాబీ కండువా కప్పుకుంటానన్నారు. సీఎం ఆదేశాలు, పార్టీ సూచనల మేరకు పనిచేస్తానన్నారు. పార్టీ ఎటువంటి బాధ్యతను అప్పగించినా తూ.చా తప్పకుండా పనిచేస్తానన్నారు. మిత్రులు, శ్రేయోభిలాషులు, ఇల్లెందు ప్రాంత ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.

224
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles