ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి

Sat,February 23, 2019 01:44 AM

-శిశువులందరికీ వ్యాక్సిన్ వేయడమే లక్ష్యం
-డీఎంహెచ్‌ఓ డాక్టర్ కళావతిబాయి
-సిబ్బందికి రెండురోజుల శిక్షణ కార్యక్రమం
ఖమ్మం క్రైం, ఫిబ్రవరి 22: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని పీహెచ్‌సీలలో వ్యాక్సిన్‌ల నిల్వల సామర్ధ్యాన్ని మెరుగుపర్చుకోవడంతో పాటు, సరఫరా వ్యవస్థను మెరుగుపర్చుకొవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ బీ కళావతిబాయి అన్నారు. జిల్లా వ్యాప్తంగా వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న వ్యాక్సిన్ మేనేజర్లు, ఫార్మసిస్ట్‌లు, స్టాఫ్ నర్సులకు సాంకేతికరించబడిన వ్యాక్సిన్ల నిర్వాహణ విధానం ద్వారా రాష్ట్రంలో వ్యాక్సిన్ల సరఫరా మెరుగుపర్చుట విధానం గురించి యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ నిపుణలచే రెండు రోజుల శిక్షణ కార్యకరమాన్ని స్థానిక కావేరి హోటల్‌లో జరిగింది. ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా ముఖ్య అతిథిగా డీఎంహెచ్‌ఓ డాక్టర్ కళావతిబాయి హాజరై మాట్లాడారు. వ్యాక్సిన్ నిర్వహణకు నూతనంగా ప్రవేశపెట్టిన ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటలిజెన్స్ నెట్‌వర్క్ (ఈవిన్) ద్వారా వ్యాక్సిన్ సరఫరా నిల్వలలో అసమతుల్యతలను నివారించవచ్చన్నారు. దీని ద్వారా వ్యాక్సిన్ మేనేజర్లకు స్మార్ట్‌ఫోన్‌లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ఎప్పటికప్పడు వ్యాక్సిన్‌ల దైనందిన నికర వినియోగం సంబంధిత రిజిస్టర్‌లో నమోదు చేస్తారన్నారు. తద్వారా ఈవిన్ అప్లికేషన్‌లోకి ఎక్కిస్తారని, అది జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి ప్రోగ్రాం మేనేజర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా పర్యవేక్షిస్తుంటారని ఆమె తెలిపారు.

అదేవిధంగా శీతలీకరణ ఉపకరణాలలో (రిఫ్రిజిరేటర్) నమోదు కాబడిన ఉష్ణోగ్రతలు కూడా ఫోన్‌కు అనుసంధానం చేయడం ద్వారా ఉష్ణోగ్రతలు సరిగ్గా అమలవుతున్నది లేనిది తెలుసుకోవచ్చన్నారు. ఈ విధానం ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేస్తూ శిశువులందరికీ వ్యాక్సిన్‌ను సమానంగా, సులభమైన రీతిలో తగు సమయానికి అందుబాటులో లభ్యమగునట్లు చేస్తుందని చెప్పారు. కార్యక్రమానికి వచ్చిన ఉద్యోగులు ఈ శిక్షణను ఏకాగ్రతతో నేర్చుకుని జిల్లాలో రేపటి నుంచి మీకివ్వబడిన మొబైల్ ద్వారా ఈవిన్‌ను అమలుపరిచి జిల్లాకు మంచి పేరు తెవాలని ఆమె కోరారు. అనంతరం ప్రాజెక్ట్ నిపుణులు పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా పలు అంశాలు వివరించారు. మొబైల్‌ను ఏవిధంగా వ్యాక్సిన్ సరఫరా కేంద్రానికి అనుసంధానం చేయాలో నేర్పించారు. జిల్లాలో ఉన్న 27 శీతలికరణ కేంద్రాల్లో వ్యాక్సిన్ లభ్యత, ఉష్ణోగ్రత కాలమాన పద్దతులు, అమలు వాటి జాబితాలు, పట్టికలు, వ్యాక్సిన్ నిల్వలు, శీతలికరణ గదులు, శీతలికరణ ఉపకరణాలు, వ్యాక్సిన్ నిల్వదారులు మొదలగు వివరాలు మొబైల్ అప్లికేషన్‌లలో నమోదు చేయబడి డిజిలైజ్జ్ చేయబడిందని ప్రాజెక్ట్ అధికారి శ్యాంజాన్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శిక్షకులు అనిల్, కేదార్ బెహరా, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ అలివేలు, ఫార్మసి సూపర్‌వైజర్లు నాగమణి, డిప్యూటీ డెమో సాంబశివరెడ్డి, సీహెచ్ రమణ, రామకృష్ణ, ఎండీ సాధిక్, సిబ్బంది పాల్గొన్నారు

311
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles