రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు..

Sat,February 23, 2019 01:44 AM

-ఎన్నికల మ్యానిఫెస్టో అమలుకు సీఎం కేసీఆర్ కృషి
-అభివృద్ధి, సంక్షేమ పథకాలతో జనరంజక పాలన
-పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ఎంపీ పొంగులేటి
-ఎర్రుపాలెంలో లబ్ధిదారులకు గ్యాస్ పొయ్యిల పంపిణీ
ఎర్రుపాలెం, ఫిబ్రవరి 22 : రాష్ట్రంలో అభివృద్ధి నిరాటంకంగా కొనసాగుతుందని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మండల పరిధిలోని బీమవరం, మామునూరు, జమలాపురం గ్రామాల్లో పాఠశాల ప్రహరీల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం, లక్ష్మీపురంలో సర్పంచ్ శీలం రాదమ్మ దంపతుల వితరణతో రూ.5 లక్షల వ్యయంతో నిర్మించనున్న అతిథి గృహానికి శంకుస్థాపన, ఎర్రుపాలెంలో చేస్టిత భారత్‌గ్యాస్ గోడౌన్ ప్రారంభం, లబ్ధిదారులకు గ్యాస్ పొయ్యిల పంపిణీ, ఎర్రుపాలెంలో టీఆర్‌ఎస్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన ప్రతిహామీని నెరవేర్చే దిశగా సీఎం కేసీఆర్ పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఎదిగిందన్నారు. ముఖ్యమంత్రి ప్రజాసంక్షేమం కోసం అహర్నిషలు పాటు పడుతున్నారనేందుకు ప్రజల్లో టీఆర్‌ఎస్‌కు ఉన్న ఆదరణే నిదర్శనమన్నారు. ప్రభుత్వం నుంచి అందించే ప్రతి పథకాన్ని, అభివృద్ధి ఫలాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఎంపీ క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరి దయాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మధిర నియోజకవర్గ ఇన్‌చార్జి లింగాల కమలరాజు, మధిర ఏఎంసీ చైర్మన్ చావా రామకృష్ణ, భద్రాచలం ట్రస్టుబోర్డు మాజీచైర్మన్ అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, వైస్‌చైర్మన్ శీలం వీరవెంకటరెడ్డి, ఎంపీపీ చావా అరుణ, జడ్పీటీసీ అంకసాల శ్రీనివాసరావు, గూడూరు రమణారెడ్డి, శీలం వెంకట్రామిరెడ్డి, వేమిరెడ్డి త్రివేణి, పంబి సాంబశివరావు, శీలం ఉమామహేశ్వరి, యన్నం కోటేశ్వరరావు, లకా్ష్మరెడ్డి, సర్పంచ్‌లు శీలం జయలక్ష్మి, శీలం రాధమ్మ, మూల్పూరి స్వప్న, మొగిలి అప్పారావు, పలుగ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

209
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles