ప్రభుత్వ భూమి వివాదంపై విచారణ

Sat,February 23, 2019 01:43 AM

కారేపల్లి రూరల్, ఫిబ్రవరి22: కారేపల్లిలోని 38 సర్వేనంబర్ గల ప్రభుత్వ భూమి వివాదంపై తహసీల్దార్ స్వామి శుక్రవారం విచారణ నిర్వహించారు. 38 సర్వే నంబరులో గతంలో పట్టాలు పొందిన గుండెబోయిన మల్లయ్య, లింగయ్య వారసులు 25 కుంటల భూమి తమదేనని ఆభూమిలో రేకులషెడ్డు నిర్మాణం చేపడుతుండగా గ్రామ పంచాయతీ వారు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. ఆభూమి పంచాయతీ డంపింగ్ యార్డుకోసం కేటాయించబడిందని పేర్కొంటూ సర్పంచి, పంచాయతీ కార్యదర్శి దానికి సంబంధించిన తీర్మానాన్ని తహసీల్దార్‌కు సమర్పించారు. దీంతో తహసీల్దార్ రెవెన్యూ సిబ్బందిని పంపి ఆస్థలంలో రేకులషెడ్డు నిర్మాణాన్ని నిలిపివేయించారు. నిర్మాణం చేపడుతున్న మల్లయ్య, లింగయ్య వారసులను కూడా తహసీల్దార్ కార్యాలయానికి పిలిపించి వారి వద్ద ఆ భూమికి సంబంధించిన పత్రాలను పరిశీలించారు. ఆ భూమి తమదేనని దానికి పూర్తి హక్కులు కల్పించాలని కోరుతూ వారి వద్ద ఉన్న పత్రాలు తహీల్దార్‌కు సమర్పించారు. కాగితాల ప్రకారం భూమి ఎక్కడ ఉందనేది సర్వే నిర్వహించి భూమిని అప్పగిస్తామని అప్పటి వరకూ అక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదని తహసీల్దార్ ఆదేశించారు.

217
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles