అభివృద్ధిలో ఖమ్మం జిల్లాను.. అగ్రభాగాన నిలుపుదాం

Thu,February 21, 2019 11:43 PM

రఘునాథపాలెం, ఫిబ్రవరి 21: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధిలో ఖమ్మం జిల్లాను అగ్రభాగాన నిలుపుదామని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలన్నింటినీ గడపగడపకూ తీసుకెళ్లి ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని రెట్టింపు చేద్దామని ప్రతినబూనారు. ఇల్లెందు ప్రధాన రహదారిని నాలుగులైన్లుగా విస్తరించేందుకు సెంట్రల్ రోడ్ ఫండ్ కింద రూ.15 కోట్లు మంజూరయ్యాయి. కోయచలక క్రాస్‌రోడ్డు వద్ద ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని జిల్లా పరిషత్ చైర్మన్ బరపటి వాసుదేవరావు, కేఎంసీ మేయర్ గుగులోతు పాపాలాల్‌తో కలిసి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు. రెండు లైన్లుగా ఉన్న ఇల్లెందు ప్రధాన రోడ్డు నాలుగులైన్లుగా విస్తరించడంతో రఘునాథపాలెం మండల ప్రజల చిరకాల కోరిక మరి కొద్దిరోజుల్లో తీరనుందన్నారు. రఘునాథపాలెం-ఇల్లెందు ప్రధాన రహదారి ఆధునీకరించేందుకు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో ఆర్‌అండ్‌బీ శాఖ నుంచి రూ.15 కోట్ల నిధులు తీసుకవచ్చినట్లు చెప్పారు.

పార్లమెంటు ఎన్నికల్లో భారీ మెజారిటీ ఇవ్వాలి
త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల స్ఫూర్తితో రఘునాథపాలెం మండలం నుంచి 10 వేల ఓట్ల మెజారిటీ అందించాలని టీఆర్‌ఎస్ నాయకులకు, ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యే అజయ్‌కుమార్ పిలుపునిచ్చారు.

ఇంటింటికీ శుద్ధజలాలు..
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకంతో ప్రజల తాగునీటి ఇబ్బందులు తొలగనున్నాయన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఓవర్‌హెడ్ ట్యాంకులు, పైపులైన్ల నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో ఇంటింటికీ మిషన్ భగీరథ పథకం ద్వారా స్వచ్ఛమైన శుద్ధిచేసిన తాగునీటిని అందించడం జరుగుతుందన్నారు. దీంతో మినరల్ వాటర్ కొని తాగాల్సిన అవసరం ఉండబోదన్నారు. జడ్పీ చైర్మన్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన బరపటి వాసుదేవరావును ఎమ్మెల్యే అజయ్‌కుమార్, ఎమ్మెల్సీ బాలసాని, మేయర్ పాపాలాల్‌లు శాలువాతో సత్కరించారు. జడ్పీటీసీ అజ్మీరా వీరూనాయక్, ఏఎంసీ మాజీ చైర్మన్ ఆర్జేసీ కృష్ణ, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ శ్యాప్రసాద్, డీఈ యుగందర్, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు మందడపు సుధాకర్, తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీపీ మాళోతు శాంత, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మద్దినేని వెంకటరమణ, ఉపాధ్యక్షుడు కొత్తా కొమరయ్య, కార్పొరేటర్ చావా నారాయణరావు, ఆత్మ చైర్మన్ రామారావు, టీఆర్‌ఎస్ నాయకులు గుత్తా రవి, రైతు సమితి మండల కన్వీనర్ దొంతు సత్యనారాయణ, కోయచలక, రేగులచలక, శివాయిగూడెం సర్పంచ్‌లు గుడిపూడి శారద, మాదంశెట్టి హరిప్రసాద్, కొర్లపాటి రామారావు, చెరుకూరి ప్రదీప్, సొసైటీ చైర్మన్లు తుమ్మలపల్లి మోహన్‌రావు, రావెళ్ల శ్రీను, తాతా రఘురాం, మేళ్లచెరువు రాంప్రసాద్, చెరుకూరి పూర్ణ, కుందె సాహెబ్, చెరుకూరి భిక్షమయ్య, యండపల్లి సత్యం, కుర్రా భాస్కర్‌రావు, గంగిరెడ్డి విజయ్‌రెడ్డి, తోట వెంకట్, దారావత్ పాండు, వడ్త్యా వీరన్న, అజ్మీరా వెంకన్న, ఆర్‌అండ్‌బీ జేఈ విశ్వనాథ్, వీఆర్‌వో రవికుమార్, సర్పంచ్‌లు, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

233
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles