జాబ్ మేళాకు విశేష స్పందన

Thu,February 21, 2019 12:12 AM

మయూరిసెంటర్, ఫిబ్రవరి 20 : ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగ యువకులకు ప్రయివేట్ సెక్టార్‌లో ఉపాధిని చూపేందుకు ఉపాధి కల్పనా శాఖ ఆధ్వర్యంలో బుధవారం టీఎన్‌జీఓ ఫంక్షన్ హాల్‌లో జరిగిన జాబ్ మేళాకు విశేషస్పందన లభించింది. ఈ సందర్భంగా పలు కంపెనీ ప్రతినిధుల సంస్థలకు చెందిన విధివిధానాలు, ఆయా విద్యార్హతలను బట్టి రిక్రూట్ మెంట్ అంశాల గురించి జిల్లా ఉపాధి కల్పనాధికారి కొండపల్లి శ్రీరామ్ తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 112 మంది హాజరుకాగా పలు కంపెనీల ప్రతినిధులు అభ్యర్థుల విద్యార్హతలను బట్టి 74 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జి4 సెక్యూర్ సోల్యూషన్ హైదరాబాద్, అపోలో హోం కేర్ హైదరాబాద్, ఏపీఓకెఓఎస్ రిహాబిలిటేషన్ సెంటర్ హైదరాబాద్, వినూత్న ఫెర్టిలైజర్స్ ఖమ్మం, శుబగ్రుహ డెవలపర్స్ హైదరాబాద్, ప్రథమ ఇనిస్టిట్యూట్ హైదరాబాద్, హైజిన్ కంపెనీ, ఐడీబిఐ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్, ఫైనాన్స్ అడ్వైజర్స్ కంపెనీల ప్రతినిధులు
పాల్గొన్నారు.

276
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles